వారిద్దరూ మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్స్ . ఒకరు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ని ఏలుతుండగా..మరొకరు తెలంగాణా మంత్రి గా మంచి గుర్తింపు పొందారు. తెలంగాణా మంత్రి కేటీఆర్, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ ల గురించే ఇదంతా.కేటీఆర్ అఖిలేష్ ని కలసిన అనంతరం వారి పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.” రాజకీయాలు పక్కన పెట్టండి.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి.నేను కలసిన ముఖ్యమంత్రుల్లో నిడారంబర వ్యక్తి,నచ్చిన వ్యక్తి అఖేష్ యాదవ్ అని చెప్పక తప్పదు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్, అఖిలేష్ ల కలయిక సరికొత్త రాజకీయానికి సంకేతమని అప్పుడే చర్చ మొదలైపోయింది. గతంలో అఖిలేష్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఆ తరువాత కేటీఆర్ స్వయంగా వెళ్లి అఖిలేష్ ని కలిశారు. మరోమారు వీరిద్దరి కలయిక జరిగింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో రాజకీయ మరియు ఇతర అవసరాలు ఉంటాయి. కానీ ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ తో కేటీఆర్ కు రాజకీయంగా ఉన్న అవసరం ఏంటనే చర్చ జరుగుతోంది. కానీ వీరిద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ వీరి స్నేహానికి నాంది అని అంటున్నారు. వీరిద్దరూ తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దూసుకుపోతున్న వారే.
Mahesh Beeravelly