వాస్తు. రియల్ ఎస్టేట్ లో ఈ మాటకు చాలా విలువ ఉంది. ఖచ్చితంగా వాస్తు ఉండాలనుకుంటారు. ఉండాలి కూడా. ఎందుకంటే.. వాస్తు వెనుక శాస్త్రీయ కారణాలుఉన్నాయి. వాస్తు నిబంధనల్ని పాటించకపోతే అమ్ముకోవడం కష్టమని రియల్టర్లకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు. వాస్తు చెప్పేదేమిటంటే ఇంట్లోకి సరిగ్గా వెలుగు వచ్చేలా చూడటం, వంట గది నుంచి పొగ నేరుగా బయటకు వెళ్లేలా చేయడం వంటివే కాదు.. ఇంకో ఎన్నో సూక్ష్మమైన విషయాలు ముడిపడి ఉన్నాయి. వీటి వల్ల ఇల్లు మరింత సౌకర్యంగా మారుతుంది.
ఇంటికిని సౌకర్యంగా మార్చేది వాస్తు. కొంత మంది దీన్ని మూఢనమ్మకంగా మార్చారు. వాస్తు నిపుణులమని చెప్పుకునేవారిలో ఎక్కువ మందికి సరైన అవగాహన ఉండదు. భారతీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని సూచించేదే వాస్తు శాస్త్రమని చెబుతారు. చైనా వాస్తలకు.. అమెరికా వాస్తులకు.. మన వాస్తులకు చాలా తేడా ఉంటుంది. వాస్తు శాస్త్రం ఒక్కటే. అది సూచించే దిశలు ఒక్కటే. అయినప్పటికీ, అన్ని దేశాలకు ఒకేలా వర్తించదని గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు వాస్తు పేరుతో ఏడు గుర్రాల ఫోటో దగ్గర నుంచి.. ఒంటికి బంగారం ధరించడం వరకూ చాలా చెబుతున్నారు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ వాస్తు పిచ్చి పట్టించేవాళ్లు ఎక్కువైపోయారు. వాస్తు అనేది ఇంటికి పూర్తిగా… సౌకర్యంగా ఉండటానికి ఉపయోగపడేలా తీర్చిద్దుకునే శాస్త్రమే కాదని.. మూఢనమ్మకం కాదు.