తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి నాలుగు రోజులు దాటిపోయింది. ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ప్రధాని మోదీతో సమావేశం అవుతారన్న ప్రచారం జరిగింది. కానీ అపాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన ఎవరితో అయినా సీక్రెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారా అన్నదానిపైనా కూడా స్పష్టత లేదు. అయితేకేసీఆర్ తన రాజకీయ కార్యకలాపాలపై ఉత్తరాదిలో ఎక్కువ ప్రచారం జరగాలని కోరుకుంటున్నారు. అందుకే అక్కడ ఓ సీనియర్ జర్నలిస్టును పీఆర్వోగా నియమించుకున్నారు.
కేసీఆర్‌కు ఢిల్లీలో ప్రజా సంబంధాల అధికారిగా (పీఆర్ఓ) సంజయ్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ సహారా సమయ్, దైనిక్ జాగరణ్ వంటి హిందీ పత్రికల్లో సంజయ్‌కుమార్ పనిచేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై హిందీ మీడియాకు, ఉత్తర భారత ప్రజలకు కేసీఆర్ గురించి సమాచారాన్ని తెలిజేయడానికి సంజయ్‌ను ఆయన పీఆర్ఓగా నియమించినట్లుగా తెలుస్తోంది. సంజయ్‌కు అవసరమైన భవన, రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు నెలకు రూ.2 లక్షల వేతనాన్ని చెల్లిస్తారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాల్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందునేనని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పదకొండో తేదీన చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి ఆయన ఏర్పాట్లపై కొన్ని సూచనలు చేశారని తెలుస్తోంది. అలాగే ఆస్పత్రి పనుల మీద కూడా బయటకు వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.