రియల్ ఎస్టేట్ స్వరూపం రాను రాను మారిపోతోంది. ఒకప్పుడు నాలుగు అంతస్తుల అపార్టుమెంట్ అబ్బురం. ఇప్పుడు ఐదు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఐదు అంతస్తులు ఉంటే అది సాదాసీదా అపార్టుమెంట్ . ఇప్పుడు కాలం మారింది. చిన్న అపార్టుమెంట్లకు బదులు పద్దెనిమిది నుుంచి అరవై అంతస్తుల వరకూ నిర్మాణాలు చేస్తున్నారు. వాటిలో ఏది ఎంచుకుటే బెటర్ ?
మధ్యతరగతి చాయిస్ చిన్న అపార్టుమెంట్లు
కనీసం 300 నుంచి 500 గజాలలో ఐదు అంతస్తుల వరకూ అపార్టుమెంట్లు ఉంటాయి. ఇప్పటి వరకూ వీటిదే మార్కెట్. ఫ్లోర్‌కు రెండు నుంచి ఆరు వరకూ ఫ్లాట్లు ఉంటాయి. మొత్తంగా 20-30 ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్లు ఎక్కువ . ఇప్పుడు కూడా ఇలాంటివే ఎక్కువగా కడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రజల అభిరుచి మారుతోంది. ఇలాంటి అపార్టుమెంట్లలో వాచ్ మ్యాన్ , జనరేటర్, లిఫ్ట్ వంటి కనీస సౌకర్యాలు ఉంటాయి. లగ్జరీలు ఉండవు. అందుకే మెయిన్టెనెన్స్ తక్కువ. మధ్యతరగతివారికి ఈ అపార్ట్మెంట్లు ధరలపరంగా అందుబాటులో ఉంటాయి. ఒక 500 గజాల
ఆపార్టు మెంట్లో పది ఫ్లాట్లు ఉంటే ఒక్కొక్కరికి యాభై 50 గజాల స్థలం వస్తుంది. వెంటిలేషన్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఇవి సిటీలోనూ ఉంటాయి..సిటీ బయట కూడా తక్కువ ధరలకు లభిస్తాయి.
హైరైజ్ అపార్టుమెంట్లు కాస్త లగ్జరీకి దగ్గరగా !
హై రైజ్ అపార్ట్మెంట్లు కనీసం పది అంతస్తులపైన ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పుడు 60 ఫ్లోర్ల కమ్యూనిటీలు కూడా కడుతున్నారు. రెండు, మూడు ఎకరాల్లో వీటిని నిర్మిస్తారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే.. చుట్టూ గోడ కట్టేసుకున్న ఓ కాలనీలో ఉండటమే. గేటెడ్ కమ్యూనిటీల్లో హై లెవెల్ సెక్యూరిటీ, సీసీ టీవీ కెమేరా వ్యవస్థ ఉంటాయి. సూపర్ మార్కెట్ నుంచి మొదలుపెడితే పార్కులు, ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ప్లే స్కూల్, డే కేర్ సెంటర్, ట్యూషన్, మినీ ధియేటర్, ఫంక్షన్ హాల్ కూడా ఉంటాయి. అంటే కావాలని తప్ప.. బయటకు వెళ్లాల్సిన అవసరం తక్కువగానే ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మెయిన్టనెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఆర్థిక సౌలభ్యం ఉండి.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే గేటెట్ కమ్యూనిటీ బెటర్
ఎవరైనా ఒక ఇల్లు కొనేటప్పడు తమ అవసరాలు చూసుకోవాలి. అనవసరంగా తమ కుటుంబాల్లోకి.. జీవితాల్లోకి తొంగి చూసేవారు ఉండకూడదనుకుంటారు. అలాగే వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా వంటి సదుపాయాలు ఇప్పుడు కోరుకుటున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదన పరులైతే.. కొన్ని విషయాల్లో గేటెడ్ కమ్యూనిటీనే బెటర్. అయితే పిడికొద్దీ రొట్టే అన్నట్లుగా బడ్జెట్ ను బట్టే ఇళ్లు కూడా. అందుకే.. ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా ఇంటికి ఫిక్సయిపోతే బెటర్.