నాగచైతన్య, బన్నీవాసు కారణంగా ‘తండేల్’ ప్రాజెక్ట్ లోకి వచ్చారు చందూ మొండేటి. కార్తిక్ అనే రచయిత రాసుకున్న కథకు తనవంతు మార్పులు చేసి దృశ్యరూపం ఇచ్చారు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతున్నారు చందు. ఆయన కార్తికేయ 3 చేయాలి. అయితే అంతకంటే ముందు ఓ సినిమా వుంటుంది. ఇది సూర్యతో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న చర్చలపై చాలా నమ్మకంగా వున్నాడు. ఇది చందు సొంత కథ.
అలాగే ఇటివల చైతుతో తెనాలి రామకృష్ణుడు బయోపిక్ అంటూ ఓ ఎనౌన్స్ మెంట్ చేశారు చందు. కానీ ఈ సినిమా ఇప్పట్లో వుండదు. దీనిపై ఆయన వెర్షన్ వేరేలా వుంది ‘ చైతు చాలా నిజాయితీ గల నటుడు. ఎలాంటి పాత్రలోకైన మారిపోగలరు. తెనాలి రామకృష్ణుడు ఆయనకి నప్పుతుంది. అలాంటి హిస్టారికల్ సినిమా, తాతగారి లెగసీ వున్న సినిమా చైతు చేయాలని స్నేహితుడిగా నా కోరిక’అని చెప్పుకొచ్చారు. అంటే చందుకి ఈ సినిమా చేసే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టమౌతోంది.