చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర నడుస్తుంది. మొన్ననే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మెగా డాటర్ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరోసారి విడాకులు తీసుకోబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా కళ్యాణ్ దేవ్, శ్రీజకి గ్యాప్ వచ్చిందనే వార్తలు వినిపించాయి. తాజాగా శ్రీజ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కళ్యాణ్ పేరుని తొలగించింది. శ్రీజ కొణిదెల అనే పేరు మార్చుకుంది. అలాగే ఇన్ స్టాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేశారు. ఇలా చేయడం ద్వారా.. కళ్యాణ్ దేవ్‌తో విడిపోయినట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చారని భావిస్తున్నారు. దీనికి తోడు తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అందులో దాదాపు కుటుంబ సభ్యులందరూ కనిపించారు. కళ్యాణ్ దేవ్ మాత్రం కనిపించలేదు. అలాగే ఆయన హీరోగా నటించిన ‘సూపర్ మచ్చి’ సినిమా సంక్రాంతికి విడుదలైతే మెగా క్యాంపు సినిమాను పట్టించుకోలేదు. ఒక్కరు కూడా కనీసం ట్వీట్ సాయం చేయలేదు. ఇవన్నీ విడాకులకు హింట్లే.
నిజానికి శ్రీజకి కళ్యాణ్ తో రెండో వివాహం. శిరీష్ భరద్వాజ్ తో ప్రేమ వివాహం చేసుకుంది శ్రీజ. అప్పట్లో ఆ వివాహం ఓ సంచలనం. వీరి ఒక పాప పుట్టింది. తర్వాత స్పర్ధలు వచ్చి విడిపోయారు. కళ్యాణ్ ఒక బిజినెస్ మెన్. శిరీష్ భరద్వాజ్ తో విడాకుల తర్వాత కళ్యాణ్ ని వివాహం ఆడింది శ్రీజ. వీరికి ఓ పాప పుట్టింది. ఇప్పుడు ఈ వివాహం కూడా విడాకుల దిశగా వెళుతుందనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి కళ్యాణ్ కి సినిమాతో సంబంధం లేదు. మెగా చుట్టరికం కలుపుకున్న తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు. ఒకవేళ విడాకుల వార్తలు నిజమై మెగా కుటుంబంతో విడిపోతే కళ్యాణ్ దేవ్ సినిమాలు కొనసాగిస్తాడో లేదో చూడాలి.