అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఏం సాధిస్తారు అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అసెంబ్లీని హుందాగా నడపలేకపోయారు అనే అప్రతిష్టను మూటగట్టుకున్న జగన్.. అధికారం కోల్పోయాక కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆయన ఇమేజ్ మరింత దిగజారిపోవడమే కాదు.. ప్రజల్లో మరింత విశ్వాసం కోల్పోతారు.
ప్రజల్లో తిరిగి విశ్వాసం పొందాలంటే జగన్ చట్ట సభల్లోనైనా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని ఆలోచనలో ఉన్న జగన్ మనసు మార్చుకోవడం పట్ల వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, సభకు హాజరై గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం..అసెంబ్లీలో నిరసన తెలుపుతాం అనే ప్రకటనే తీవ్ర విమర్శలకు దారితీసింది.
Also Read : జగనా.. లైట్ తీస్కోండి..!
సభ సజావుగా నడిచేందుకు సహకరిస్తూ.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి.. ప్రజల్లో వైసీపీపై ఓ నమ్మకాన్ని కుదుర్చాల్సిన జగన్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి హాజరైనట్టే హాజరై సభ నుంచి నిష్క్రమించాలనే ధోరణిలో ఆయన రాజకీయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో తనను తాను నిరూపించుకుంటునే..వైసీపీ భవిష్యత్ కు ఉందని విధంగా వ్యవహరించాల్సిన జగన్ అందుకు విరుద్దంగా చేస్తోన్న రాజకీయాలు బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉందని జగన్ కూ తెలుసు. అయినా అదే పని చేస్తామంటున్నారు. ఇలాంటి వ్యవహారశైలే జగన్ ను మరింత అప్రతిష్టపాలు చేయనుంది. కానీ వీటిని జగన్ ఎప్పుడు గ్రహిస్తారు అన్నదే అసలు ప్రశ్న.