రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరో క్లారిటీ ఉండాలి. లేకపోతే ఎవరితో పోరాడుతున్నామో గుర్తించే సరికి ప్రత్యర్థి అందనంత వరకూ వెళ్లిపోతాడు. ఇప్పుడు వైసీపీ అదే డైలమాలో ఉంది. తమ ప్రత్యర్థి పోలీసులా.. టీడీపీనా తేల్చుకోలేకపోతున్నారు. చివరికి పోలీసులతో ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ సలహా ఎవరు ఇచ్చారో కానీ వారికి టీడీపీ ధ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.
పోలీసులతో సున్నం పెట్టుకున్న వైసీపీ
విజయవాడలో ఓ సారి పోలీసుల బట్టలిప్పదీస్తా అని జగన్ అన్నారు. రాప్తాడులో కూడా ఉన్నారు. దీంతో ఒక్క సారి పోలీసు వర్గాలు ఫైర్ అయ్యాయి. ఓ మండల ఎస్సై జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ రేంజ్ ఓ ఎస్ఐ స్థాయికి పడిపోయింది. ఆయన ఎస్ఐకి ఎందుకంటే ఫోకస్ వచ్చిందంటే.. జగన్ వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేశారు. ఇక ఎస్పీ ఖండించారు. పోలీసుల అధికారుల సంఘాలు ఖండించాయి. రిటైర్డ్ పోలీసులూ అవేం మాటలని మండిపడ్డారు. మొత్తంగా అధికారంలోఉన్నప్పుడు తమను అడ్డగోలుగా వాడుకుని ఇప్పుడు బట్టలిప్పదీస్తా అని అవమానించడం వారిని రగిలిపోయేలా చేస్తోంది.
బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్న చచ్చు సలహా ఎవరిచ్చారో ?
జగన్ రెడ్డికి సొంత తెలివి తేటలు లేవు. ఆ విషయం తెలిసే ఆయన కోటరి ఆయనతో ఫుల్ బాల్ ఆడుకుంటూ ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వస్తామని .. వస్తే ఊరుకునేది లేదని బ్లాక్ మెయిల్ చేద్దామని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడాలన్న ఓ సలహా జగన్ రెడ్డిని పాతాళంలోకి పడేసిన సలహాదారుల నుంచి వచ్చింది. దాన్ని జగన్ ముందూ వెనుకా చూసుకోకుండా అమలు చేశారు. కానీ రియాక్షన్ ఇలా ఉంటుందని వారు ఊహించలేకపోయారు. సామాన్య జనంలో కూడా జగన్ ఉన్నప్పటికి పోలీసులే కదా అన్న చర్చ జరుగుతోంది.
క్రిమినల్ రాజకీయ నేతలతో వచ్చే సమస్యే అది !
జగన్ రెడ్డి అత్యంత ఘోరమైన.. నేర మనస్థత్వం ఉన్న క్రిమినల్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుటుంబసభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన గొప్ప చరిత్ర ఉంది. పోలీసుల ను ఓ మాఫియా ముఠాలా వాడుకున్న విషయం కళ్ల ముందే ఉంది. ఇలాంటి వారు అధికారం పోయినా సరే.. వ్యవస్థల్ని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటారు. అదే జరుగుతోంది. చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్.. గుడ్డిగా అభిమానించే జనం ఉంటారని ఇలాంటి వారి బరి తెగింపు.