బీఎల్ సంతోష్ హైదరాబాద్ పర్యటన ఆసక్తి రేపుతుండగానే..కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. కవితతో ములాఖాత్ అయ్యేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు కేటీఆర్ చెబుతున్నా…బీజేపీతో దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీతో కలిసి సాగేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, బీఆర్ఎస్ చేస్తోన్న ఈ ప్రయత్నాలకు బీఎల్ సంతోష్ అడ్డు తగులుతారు అనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతో ఆయన గులాబీ బాస్ ను రాజకీయంగా దారుణంగా దెబ్బతీయాలని అప్పట్లోనే లక్ష్యంగా పెట్టుకున్నారన్న టాక్ నడిచింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఓడటం..అవసరాల కోసం బీఆర్ఎస్ , బీజేపీ వైపు చూస్తుందన్న ప్రచారం సాగుతోంది.
Also Read : మరో బిగ్ షాక్..కేసీఆర్,హరీష్ రావుకు కోర్టు నోటీసులు!
స్పెషల్ ప్లైట్ లో బీఎల్ సంతోష్ అరెస్టు కోసం పోలీసులను పంపడం పట్ల కేసీఆర్ పై ఆయన ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ ను చావు దెబ్బకొట్టేలా బీఎల్ సారథ్యంలో ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఆయన మూడు రోజుల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం ఆసక్తి రేపుతోంది. ముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం అయినా.. బీఎల్ హైదరాబాద్ లో వాలిన వేళ.. కేటీఆర్ హస్తిన టూర్ చర్చనీయాంశం అవుతోంది.