దిశా రవికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె ఏమీ తప్పు చేయలేదని తేల్చింది. టూల్ కిట్‌ను ఎడిట్ చేయడం నేరం కానే కాదని స్పష్టం చేసింది. ఖలిస్తాన్ పేరుతో ఆమెపై మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని తేల్చింది. దేశద్రోహం కేసు పెట్టడాన్ని తప్పు పట్టింది. దీంతో దేశంలో న్యాయవ్యవస్థపై చాలా మందికి పోతున్న నమ్మకం నిలబడింది. దిశారవి కేసు గురించి కనీసం ప్రాథమిక సమాచారం తెలిసినా…. ఆమె కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. రైతులకు మద్దతు తెలిపినందుకు .. గ్రెటా ధన్ బర్గ్ ఆలోచనతో పురుడు పోసుకున్న ఓ పర్యావరణ స్వచ్చంద సంస్థకు పని చేయడం ఆమె చేసిన నేరం. ైతుల ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో ఉన్న ఓ టూల్ కిట్‌లో తన అభిప్రాయాన్ని పంచుకోవడం ఆమె చేసిన నేరం. దీనికే ఈ 21 ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు.. ఉద్యమకారిణిపై కేంద్రం ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టింది.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. వారి డిమాండ్ రైతు చట్టాలను రద్దు చేయడం . దానికి కేంద్రం సిద్దంగా లేదు. ఇక రైతుల్ని వెనక్కి పంపాలి. కానీ అలా పంపడానికి కేంద్రం వేస్తున్న ఎత్తులు భయంకరంగా ఉన్నాయి. వారిపై ఖలిస్తాన్ ముద్ర వేశారు. అసలు దేశంలో లేని ఖలిస్తాన్ అనే వేర్పాటు వాదాన్ని కేంద్రం ఈ విధంగా ప్రోత్సహించింది. దేశద్రోహానికి పాల్పడుతోంది. రైతులకు…ఖలిస్తాన్‌కు ఏం సబంధంమో.. కేంద్రం చెప్పలేదు. కానీ రైతులకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరిపై ఖలిస్తాన్ సపోర్టర్ల ముద్ర వేసి… దేశద్రోహం కేసులు పెట్టడానికి వెనక్కితగ్గడంలేదు. దిశా రవి కేసు అందులో ఒకటి. భయపెట్టి ఇతరులెవరు నోరు తెరవకుండా ఉండే లక్ష్యంతోనే కేంద్రం ఈ దురాగతానికి పాల్పడింది. అందులో సందేహం లేదు.
ఒక్క దిశా రవి కేసు మాత్రమే కాదు… ఏ రాష్ట్రంలో చూసినా .. చట్టాలను దుర్వినియోగం చేసి.. ప్రజల్ని…ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారందరిపై కేసులు పెట్టి.. జైళ్లలో వేస్తున్నారు. చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. పాలక పార్టీల చేతుల్లో ప్రజల్ని వేధించడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసుల చట్రం విరుచుకుపడుతోంది. దేశంలో ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితి ఇది. అయితే ప్రభుత్వానికి బాకా ఉదాలి. లేకపోతే ఖాళీగా ఉండాలి. అంతకు మించి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు దిగితే.. కేసులు..జైళ్లే. మరే గతి లేదు. ఈ దేశంలో బతకాలంటే బానిసలా పడి ఉండాల్సిందేనన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
దేశంలో యువత ఇప్పుడు భావోద్వేగ రాజకీయాల్లో ఉన్నారు. వారి కళ్లను.. కొన్ని భావోద్వేగాలు కమ్మేలా చేయడంలో పాలకులు సక్సెస్ అయ్యారు. ఆ తెర ఇప్పుడు కొద్ది కొద్దిగా వీడిపోతోంది. అలా వీడిపోతున్న కొద్దీ యువతలో చైతన్యం వస్తుంది. తాము ఏం కోల్పోతున్నామో తెలుసుకుంటారు. అప్పుడే అసలు ఉద్యమం ప్రారంభమవుతుంది. దానికి దిశారవి వంటి వారే స్ఫూర్తి.