క్యాడర్ అంతా రోడ్ల మీదకు వచ్చి కేసులు పెట్టించుకుటే గుడ్ బుక్‌లో పేర్లు రాసుకుని వారికి అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తానని జగన్ తాయిలం ప్రకటించారు. మరి జగన్ బయటకు రారా రోడ్డెక్కరా అంటే మాత్రం సైలెంట్ అవుతున్నాయి. తిరుమలకు వెళ్లాల్సిన ఆయన దాడిచేస్తారన్న భయంతో ఆగిపోయారని చెప్పుకోవడంతో ఆయన పరిస్థితి క్యాడర్ కు అర్థమైపోయింది.
జగన్ ను దయచేసి మర్డర్ చేయవద్దు అని పోసాని కృష్ణమురళితో చెప్పించుకుంటున్నారు. జగన్ కు ప్రాణభయం ఉంది అని కరుణాకర్ రెడ్డి అంటున్నారు. జగన్ ను ఒంటరి చేసి దాడి చేయాలనుకుంటున్నారని చెవిరెడ్డి చెబుతున్నారు. సిల్లీ కుట్రల నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే చెబుతున్నారు. నిజానికి అందరికీ స్క్రిప్టు సజ్జలే పంపుతారు. ఎందుకిలా అంటున్నారు.. జగన్‌కు ఇంత భయమా ? అంటే అంతకు మించి అని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం యుద్ధం చేయాలని క్యాడర్ పిలుపునిస్తున్నారు.
జగన్ రెడ్డిపై ఎవరూ దాడి చేయరు. ఆయన ప్లాన్డ్ గా చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్న కోడికత్తి వ్యవహారంలో చిన్న గీతకే యన చేసిన రచ్చ ఎంత ఉందో అందరూ చూశారు. విజయవాడలో తగలని రాయితో తగిలిందని చేసిన రాజకయంతో ప్రజలు కూడా ఆయన ధైర్యాన్ని చూశారు. ఇంత చూసిన తరవాత ఎవరైనా జగన్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారా ?. జగన్ రెడ్డికి ప్రజల్లోకి వెళ్లడానికి భయం పుడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అదే భయం.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా అదే భయం. అందుకే ఆయన బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
జగన్‌లో ఉన్న మానసిక రోగ లక్షణాల్లో ఒకటి భయం అని ఆయన భద్రతకు చేసుకున్న ఏర్పాట్లను బట్టి అర్థమవుతుంది. తాడేపల్లిలో ఆయన ఇంటికి వైపు వెళ్తే ఇవేం ఏర్పాట్లని అందరూ ఆశ్చ్యపోతారు. తనకు తొమ్మిది వందల మందితో సెక్యూరిటీ కావాలని ఆయన చేసిన రచ్చ ఏమిటో కళ్ల ముందే ఉంది. జగన్‌కు ఇంత భయం ఎందుకో వైసీపీ నేతలకు అర్థం కావడంలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష నేతపై దాడి జరగలేదు. తండ్రి వైఎస్‌తో పాటు కుమార వైఎస్ కూడా హాయిగా పాదయాత్రలు చేసుకున్నారు. ఇప్పుడే ఎందుకు భయం వేస్తోంది ?