విపక్ష పార్టీలు సంక్షేమం పేరుతో అవినీతికి గ్యారంటీ ఇస్తాయి..నేను మాత్రం అవినీతి పరులకు శిక్షలు వేయించడానికి గ్యారంటీ ఇస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భోపాల్లో చెప్పిన డైలాగ్ దేశ ప్రజల మైండ్ బ్లాంక్ చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే సొంత నేతల్నే జైలుకు పంపిన రికార్డు ఉంది కానీ.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ నేతల అవినీతి బయటపడితే చూసీ చూడనట్లుగా పోతుంది. బయట అవినీతి చేసిన వారు ఎవరైనా తమ పార్టీలో చేరితే అందరికీ క్లీన్ చిట్ వచ్చేలా చేస్తుంది. తమ పార్టీకి మద్దతు ప్రకటిస్తే చాలు దేశాన్ని దోచుకున్న నేతలైనా.. కుటుంబ సభ్యులను దారుణంగా హత్యలుచేసిన వారినై ఇట్టే బయటపడిపోతూంటారు. అదే మోదీ లేదా బీజేపీకి సపోర్టర్లు కాకపోతే మాత్రం అసలు నేరం చేశారో లేదో తెలియని కేసుల్లో సైతం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలు హంగామా చేస్తూంటాయి.
ఇదంతా కళ్ల ముందు కనిపించే నిజం. కానీ ప్రధాని మోదీ మాత్రం అవినీతి పరులకు శిక్షలు గ్యారంటీ అంటూ మాటలుఇంకా చెబుతున్నారు. ఇదే మాటలు తొమ్మిదేళ్ల కిందట చెప్పారు. ఏడాదిలో అవినీతి పరులకు శిక్షలు పడతాయని చెప్పారు. తొమ్మిదేళ్లు దాటినా ఒక్కరికీ శిక్షలు పడకపోగా.. నేరస్తులందర్నీ త మపార్టీలో చేర్చుకున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది నేరస్తులు సుద్దపూసలయ్యారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన వారి కేసులు కనీసం విచారణకు కూడా రావడం లేదు. కానీ మోదీ మాత్రం ఇంకా గ్యారంటీలు ఇస్తున్నారు.
దేశంలో అవినీతి పరులను మోదీ శిక్షిస్తారని ఎవరూ ఆశలు పెట్టుకోవడం లేదు. గతంలోనే ఇది తేలిపోయింది. ఆయన చెప్పే మాటల్ని మఖ్యంగా అవినీతిపై ఆయన చెప్పే మాటల్ని ప్రజలు ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాజాగా కవిత విషయంలో కూడా అంతే. పైగా ఆయన ప్రజలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయాలని.. అదే కవిత బాగుండాంటే బీఆర్ఎస్ కు ఓటేయాలన్న విచిత్రమైన లాజిక్ చెప్పారు. ఇలాంటి నినాదాలకు లోటేమీ ఉండదు కానీ.. అవినీతి పరులు మాత్రం దర్జాగా రాజకీయాలు చేసేసుకుంటున్నారు.