ఇండస్ట్రీలు నాలుగు మూల స్థంభాలు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నాడు. నాగార్జున ఇంటి నుంచి నాగచైతన్య, అఖిల్ వచ్చారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. మరి వెంకటేష్ వారసుడు ఎప్పుడు తెరపైకి వస్తాడు? వెంకీకి అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. మీడియా ముందుకు వచ్చింది చాలా తక్కువ. అసలు అర్జున్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలు కూడా ఎవరికీ తెలీవు. ఇప్పుడు అర్జున్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెంకీ పంచుకొన్నాడు.. అన్స్టాపబుల్ లో.
బాలయ్య ఆహా కోసం నిర్వహిస్తున్న టాక్ షో.. అన్ స్టాపబుల్. ఈ షోకి వెంకీ అతిధిగా వెళ్లాడు. ఈ సందర్భంగా అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని బాలయ్యతో పంచుకొన్నాడని టాక్. అర్జున్ ప్రస్తుతం అమెరికాలో చదువుకొంటున్నాడని, తనకూ సినిమాలంటే ఆసక్తి ఉందని వెంకీ చెప్పుకొచ్చాడట. దాంతో.. అర్జున్ ఎంట్రీపై తొలిసారి టాలీవుడ్ లో చర్చ మొదలైంది. అర్జున్ ఎంట్రీ ఇస్తే ఎలాంటి సినిమాతో వస్తాడు? అందుకోసం వెంకీ, సురేష్ బాబు ఏం చేయబోతున్నారు? అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇదే ఎపిసోడ్ లో అనిల్ రావిపూడి కూడా మెరవబోతున్నాడు. మీనాక్షి చౌదరి కూడా ఈ షోలో కనిపించబోతోంది. ఈ సందర్భంగా వెంకీ-బాలయ్యల మల్టీస్టారర్ గురించిన ప్రస్తావన వచ్చిందని, అనిల్ రావిపూడి ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్యతో, వెంకీతో సినిమాలు చేశాడు అనిల్ రావిపూడి. ఇద్దరి స్టైల్ తనకు బాగా తెలుసు. కాబట్టి అనిల్ రావిపూడి గనుక ఈ ప్రాజెక్ట్ భుజాన వేసుకొంటే… వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.