రాజశేఖర్ `కల్కి`పై చాలా ఆశలే ఉన్నాయి. అటు పరిశ్రమ, ఇటు వ్యాపార వర్గాలూ ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ పూర్తయింది. ఇదో థ్రిల్లర్. ఓ హత్య చుట్టూ తిరిగే కథ. హంతకుడ్ని పట్టుకోవడం అనేది కథానాయకుడి టార్గెట్. అయితే ఈ సినిమాలో గ్లామర్‌కి కొదవ లేదు. ఆదాశర్మ, నందిత శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. స్కార్లెట్‌తో ఓ దుమ్ము రేపే ఐటెమ్ సాంగ్ ఒకటి డిజైన్ చేశారు. కమర్షియట్ టచ్ ఎక్కడా మిస్ అవ్వలేదు. అయితే ప్రచార చిత్రాల్లోగానీ, ప్రమోషన్లలో గానీ ఈ భామలెవరూ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ కల్కికి సంబంధించిన టీజర్, ట్రైలర్, హానెస్ట్ ట్రైలర్ బయటకు వచ్చాయి. వాటిలో యాక్షన్ మూమెంట్స్ ఎక్కువ. కథానాయికల్ని అస్సలు చూపించనే లేదు. నందిత శ్వేత అయితే ఎక్కడుందో వెదుక్కోవాల్సిన పరిస్థితి. అసలు ఈ కథలో కథానాయికలకు చోటుందా? వాళ్ల పాత్రలన్నీ అప్రధానమైనవేనా? అనే డౌట్లు వస్తున్నాయి. కనీసం ప్రమోషన్లలోనూ వీరెవరూ కనిపించం లేదు. కల్కి విడుదలకు రెండు రోజుల సమయం కూడా లేదు. ఈరోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజశేఖర్ అనారోగ్యం పాలవ్వడంతో… రద్దయ్యింది. రేపు జరిగే ఛాన్స్ లేదు. విడుదలకు ముందు ప్రమోషన్లకు బ్రేకులు పడడం, కథానాయికలెవరూ బయటకు రాకపోవడం… కల్కికి మైనస్‌గా మారుతుందేమో..?