టైమ్స్ నౌ చానల్లో ETG అనే కంపెనీ ఇచ్చే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ను వైసీపీ, సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచురించేది. జగన్ రెడ్డిల వైనాట్ 175ను ఎప్పుడూ నిజం చేసేది ETG. అయితే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పట్నుంచి ఈ కంపెనీ అడ్రస్ లేదు. దేశవ్యాప్తంగా సర్వే చేయగల సామర్థ్యం ఉన్నట్లుగా టైమ్స్ లో గొప్పగా పోల్స్ ప్రకటించుకునే సంస్థ ఇప్పుడు ఎక్కడకు పోయిందో ?.
ETG అనేది ఓ డమ్మీ కంపెనీ. సర్వేలను తాడేపల్లి ప్యాలెస్లో రాజకీయ మేధావులు రెడీ చేస్తారు. అవినాష్ ఇరగవరపు అనే వ్యక్తి ప్రజాధనంతో జీతం తీసుకుంటూ… అడ్డగోలుగా సంపాదన చేసుకుంటూ నాటి ప్రభుత్వ పెద్దలకు గిలిగింతలు పెట్టేందుకు దీన్ని పేపర్లపై ఏర్పాటు చేశారు. టైమ్స్ నౌకు ప్రజాధనం దోచి పెట్టి ప్రైమ్ టైమ్ లో స్లాట్ కొనుక్కుని మరీ సర్వేలను ప్రకటించేవారు. చివరికి టైమ్స్ నౌ పరువును, విశ్వసనీయతను కూడా ETG దెబ్బకొట్టింది.
ఈ కంపెనీ నిర్వాకాన్ని తెలుగు360 బయటపెట్టి టైమ్స్ నౌ చానల్ ను ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి ఫేక్ సర్వేలతో ప్రజల్ని మోసం చేయగలమని నమ్మారు. ప్రజాధనం దోచుకోగలమని నిరూపించగలిగారు కానీ… సర్వేలతో వారి అభిప్రాయాలను మార్చలేరని తేలిపోయింది. ఇప్పుడీ ETG తాడేపల్లిలోనే ఉంటుంది. కాకపోతే… సర్వేలు చెప్పాల్సిన అవసరం ఇంకా రాలేదు. బహుశా.. మరో రెండేళ్ల తర్వాత మరో పేరు పెట్టుకుని అయినా బయటకు వస్తారేమో !