నేను రూ. 25 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తానని పవన్ కల్యాణ్ చాలా సార్లు బహిరంగసభల్లో గొప్పగాప్రకటించారు. సినిమా హీరోగా ఆయనకు వచ్చే రెమ్యూనరేషన్.. ఇప్పటి వరకూ..ఆయన సంపాదించిన సొమ్మును పెట్టుబడిగా పెడితే వచ్చే ఆదాయం అంతా కలిపి.. వచ్చే సొమ్ముకు ఇంత ఆదాయపు పన్ను కడతారేమో అనుకుంటారు. కానీ.. ఆయన ఆస్తులు …అలా లేవు. ఎన్నికల నామినేషన్లో భాగంగా ఆయన వేసిన అఫిడవిట్లో.. తనకు రూ. 50 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు చూపారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది.
రూ. 25 కోట్ల ఐటీ కడితే… రూ. 52కోట్ల ఆస్తులేనా పవన్..!?
విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనకు రూ. 52 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. చరాస్తులు రూ.12,00,48,393 కోట్లు, స్థిరాస్తులు రూ. 40,81,16,987 కోట్లు ఉన్నట్లుగా చూపారు. ఈ ఆస్తులకు తోడుగా.. అప్పులు రూ.33,72,65,361 కోట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంటే అప్పులు తీసేస్తే.. ఆస్తులు రూ. 20 కోట్లుగానే తేలతాయి. మరి ఇంత కాలం… ఒక్కో సినిమాకు కనీసం యాభై కోట్లు తీసుకుంటారనే ప్రచారం ఉంది. చాలా కాలం సినీ కెరీర్లో ఉన్నారు. ఎన్నో విజయాలు సాధించారు. కొన్ని సినమాల్లో భాగస్వామ్యం తీసుకున్నారు. అయినప్పటికీ.. తన ఆస్తులను రూ. 52 కోట్లకే ఎందుకు పరిమితం చేసుకున్నారు.
అమరావతిలో కట్టుకుంటున్న ఆ రెండుకరాల ఇల్లే రూ. 50 కోట్లు కదా..?
సహజంగా.. ఆస్తుల డిక్లరేషన్‌లో అందరూ… అసలు విలువలు దాచి పెడుతూ ఉంటారు. తాము కొనుగోలు చేసిన నాటి ఆస్తుల వివరాలు పెడుతూంటారు. కానీ ఇప్పుడు.. ఎన్నికల సంఘం.. సహజంగానే.. అసలు విలువలు చెప్పాలని ఆదేసించింది. ఈ ఆదేశాలను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయాన్ని మారుస్తానంటూ వచ్చిన పవన్ కల్యామ్ కూడా ఆ కోవలోకే వెళ్లారు. నిజానికి అమరావతిలో పవన్ కల్యాణ్ కట్టుకుంటున్నా.. ఆ రెండు ఎకరాల ఇల్లు.. పార్టీ ఆఫీసు.. రూ. 50 కోట్లు చేస్తుంది. అది ఇప్పుడిప్పుడే కొనుగోలు చేసింది. ఆ స్థలం మార్కెట్ రేటు కూడా అంతే భారీగా ఉంటుంది. పైగా మొన్న జూబ్లిహిల్స్‌లో ఓ కొత్త ఇంటిని నిర్మించారు. గృహప్రవేశం కూడా చేశారు. అయినప్పటికీ.. ఆ ఇంటి విలువను కూడా తక్కువ చేశారు.
మాటల్లో చెప్పే మార్పుని చూపించలేకపోయారా…?
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కల్యాణ్ కు రూ.55కోట్ల ఆస్థులూ రూ.33కోట్ల అప్పులూ ఉన్నాయి. కోట్లు వచ్చిపడే సినిమా రంగాన్ని వదిలేసి ప్రజాజీవితంలోకి వచ్చేశారు. స్వచ్ఛమైన అవినీతి రహిత పాలననూ సమాజాన్నీ తేవాలన్న మహా సంకల్పంతో ముందుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే జీతభత్యాలన్నీ కలిపి ఏడాదికి నలభై లక్షలు మించదు. ఒక సినిమాకు తీసుకునే పారితోషికం..20ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా జీతం రూపంలో రాదు. మరి ఆ రూ.33కోట్ల అప్పును పవన్ ఎలా తీరుస్తారు? రాజకీయాల్లో నీతిమంతంగా ఉంటామని ప్రజలకు మాటిచ్చారు కాబట్టి మిగతా రాజకీయ నాయకుల్లా కాంట్రాక్టులూ కమీషన్ల వంటి ‘పనులు’ చేసుకోలేరు. అంటే ఆస్తులమ్ముకుని అప్పులు తీర్చాల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి తన ఆస్తులు రూ. 22 కోట్లు అయిపోతాయేమో..?
ఏ విధంగా చూసినా పవన్ కల్యాణ్…తను మాచల్లో చెప్పే… మార్పు, నిజాయితీ.. తన ఎన్నికల అఫిడవిట్లో చూపించలేకపోయారన్నది వాస్తవం.