రాజ్ కసిరెడ్డి కోసం సీఐడీ సిట్ అధికారులు హైదరాబాద్లో వెదుకుతున్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు బయో డైవర్సిటీ పార్క్ ఎదురుగా కొత్తగా కట్టిన లగ్జరీ ఆస్పత్రి అరాటే లోనూ సోదాలు చేశారు. అయితే ఆయన దొరకలేదు. ఆయన ఇంటికి మరో సారి నోటీసులు అంటించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఒకప్పుడు ఐ ప్యాక్ ఉద్యోగి అయిన రాజ్ కసిరెడ్డి జగన్ హయాంలో ఐటీ సలహాదారు అయ్యారు. మద్యం బిజినెస్ మొత్తాన్ని తన చేతుల మీదుగా నడిపించాడు. మొత్తం లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు. ఆయన కూడా పెద్ద ఎత్తున పోగేసుకున్నాడు. వందల కోట్ల ఆస్తి పరుడు అయ్యాడు. అన్ని ఆధారాలతో సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలుస్తూంటే ఐటీ సలహాదారును తనకు మద్యంతో ఏం పని అని అడ్డగోలు వాదనలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కోర్టులకు వెళ్లాడు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.
అప్పట్నుంచి రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఆయనకు సలహాదారుడిగా ఉంటూ పోలీసులకు దొరక్కుండా ఏం చేయాలో ఎలా చేయాలో సలహాలు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం దాటిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు. మరి ఇక్కడే ఉంటే పట్టుకోవడం పెద్ద విషయం కాదు. కానీ సీఐడీ అధికారులు పట్టుకోవడం లేదా లేకపోతే చిక్కడం లేదా అన్నదే సందేహం. ఎందుకంటే లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ ఒక్క అరెస్టు కూడా సిఐడీ అధికారులు చూపించ లేదు.