విజయవాడ వరదల సమయంలో ప్రజలంతా తమ శక్తి మేర ఆదుకున్నారు. విరాళాలు ఇచ్చారు. అయితే సూపర్ రిచ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ తరపున రూ. కోటి విరాళాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ విరాళం ఎవరికి అందిందో స్పష్టత లేదు. గతంలో హుదూద్ వచ్చినప్పుడు కూడా అంతే. ప్రకటించిన విరాళం ఇవ్వకుండానే .. సాయం చేయకుండానే ప్రకటనలకు సరిపోయింది. ఇప్పుడు ఆయన ప్రకటించిన విరాళం గురించి ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. మంత్రి అనిత తో పాటు ఇతర సభ్యులు జగన్ ఫేక్ ఔదార్యం గురించి విమర్శలు గుప్పించారు.
అయితే జగన్ ఫైస్ వాల్యూ కాపాడేందుకు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చాలా ప్రయత్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని అందుకే తాము సొంతంగా ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు. కావాలంటే బిల్లులు ఇస్తామన్నారు. ప్రభుత్వం అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు ఖర్చు పెడుతుందని తామే ఆహారపదార్థాలను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉందో లేదో తర్వాత సంగతి ప్రభుత్వాన్ని నడిపిన వారికి ప్రభుత్వానికి విరాళం ఇస్తే.. ఆ విరాళం ప్రభుత్వ ఖాతాలోకి చేరుతుంది.. రికార్డెడ్ గా ఉంటుందని తెలుసు. కానీ ఇలా మేమే పంచాము అంటే ఎవరు నమ్ముతారు?
వైసీపీ కోటి విరాళం ప్రకటించిన తర్వాత .. చాలా రోజులకు వరదల పరిస్థితి పోయి.. పరిస్థితి కుదటపడిన తర్వాత రెండు మూడు ఆటోరిక్షాల్లో వైసీపీ స్టిక్కర్లతో ఉన్న కొన్ని బియ్యం బస్తారు.. మరో క్యారీ బ్యాగ్ లో కొన్ని సామాన్లు కలిపి పంచుతున్నట్లుగా కొన్ని ఫోటోలు పోస్టు చేసుకున్నారు. కానీ వారెక్కడ పంచారో ప్రజలెవరికీ తెలియదు. డబ్బులు ఇవ్వకుండానే.. రూ. కోటి పెట్టి సాయం చేశామని ప్రచారం చేసుకున్నారు. కానీ అందులో నిజం ఎంత ఉందో ప్రజలకు క్లారిటీ వస్తోంది.