వైసీపీ అధికారం పోయాక చాలా మంది సైలెంట్ అయ్యారు కానీ.. ఒకడు మాత్రం కంటికి కనిపించడం లేదు. అతని పేరు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక కొన్నాళ్లు సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్నారు. తర్వాత ఓ నామినేటెడ్ పోస్టు కూడా వచ్చింది. భూమికి మూడు అడుగులు కూడా ఉండని ఆ వ్యక్తి పెద్ద పెద్ద మాటలు అనేవాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, రఘురామ వరకూ ఎవర్నీ వదిలేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.
ఈ గుర్రంపాటి మిడిసిపాటు చూసి వైసీపీలోనే చాలా మందికి ఆశ్చర్యం కలిగేది. జగన్ రెడ్డికి ఏది సంతోషం కలిగిస్తుందో తెలుసు కాబట్టి అలాంటి పోస్టులు పెట్టి ఆయన దగ్గరకు వెళ్లి చూపించి.. నవ్వించేవారని అంటారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఒక్క పోస్టు కూడా పెట్టడం లేదు . అప్పట్లో తాను తిట్టిన వారిని తిట్టడం కాదు అసలు జగన్ రెడ్డికి సపోర్టుగా కూడా ట్వీట్లు చేయడం లేదు. అందుకే ఆయన ఎక్కడున్నారా అని.. వైసీపీ నేతలు వెదుక్కుంటున్నారు.
ఓ సారి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులతో ముఖాముఖి పెడితే అందులోకి చొరబడి వెకిలిమాటలు మాట్లాడాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన ఎంతో మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సొంత పార్టీకి సపోర్టు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్లిపోయారు. కానీ అంతకు ముందు ఎక్కడ ఉన్నారోకూడా తెలియని వీరు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చక్రం తిప్పారు. అధికారం పోగానే కలుగులోకి పోతున్నారు. ఇలాంటి వారిని బయటకు తీసుకు వచ్చి బడితెపూజ చేయాలన్న డిమాండ్ సహజంగానే టీడీపీ క్యాడర్ నుంచి వస్తోంది.