మేకపాటి గౌతంరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబం ప్రత్యేకంగా నెల్లూరులో ఏర్పాటు చేసింది. దశ దిన కర్మను భారీగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సీఎం, మంత్రులు అందరూ వచ్చారు. కానీ… మళ్లీ సంస్మరణ సభను ఏర్పాటు చేసి సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సభ ఏర్పాటు వెనుక ఉద్దేశం… మళ్లీ ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబానికే చాన్సిస్తామన్న సంకేతాలతో పాటు గౌతంరెడ్డి మంత్రిపదవిని కూడా మరోసారి తమ కుటుంబానికే దక్కేలా సీఎం జగన్ నుంచి భరోసా పొందడం.
అయితే సీఎం వచ్చారు.. పావు గంట సేపు మాట్లాడారు. ఆ తర్వాత వెళ్లిపోయారు.ల తన ప్రసంగంలో గౌతంరెడ్డిని పొగిడారు.. సంగం బ్యారెజీకి పేరు పెడతామన్నారు కానీ ఆత్మకూరు టిక్కెట్ గురించి మాట్లాడలేదు. గౌతం రెడ్డి భార్యకో.. లేకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డికో అసెంబ్లీ టిక్కెట్‌తో పాటు త్వరలో జరగనున్న మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని మాట వరుసకు కూడా చెప్పలేదు. ఆ విషయం అసలు మాట్లాడలేదు. దీంతో మేకపాటి వర్గీయుల మనసు చివుక్కుమంది. ఏదో ఒక హామీ వస్తుందని ఎక్కువ మంది ఆశించారు.
కానీ ఏదీ రాలేదు. దీంతో సీఎం జగన్ మేకపాటి కుటుంబానికి రాజకీయ సాయం చేస్తారా లేకపోతే.. అలా వదిలేస్తారా అన్న చర్చ ప్రారంభమైంది. సంస్మరణ సభకు వెళ్లి రాజకీయం ఎందుకని జగన్ అనుకున్నారని. . గౌతకం రెడ్డిక కుటుంబానికి జగన్ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.