భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయింది. రికార్డ్ స్థాయి వర్షపాతంతో జలగ్బంధంలో చిక్కుకుంది. వరదనీరు ఇళ్ళలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద సహాయక చర్యలు ఓ వైపు ప్రభుత్వం కొనసాగిస్తూనే.. బాధితులను ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావాలని కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి.
వరద బాధితులకు కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నా.. వైసీపీ నేతలు పత్తాకు లేకుండా పోయారు. రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా విజయవాడ మునిగి ప్రజలు అపోసోపాలు పడుతుంటే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు..? అని విజయవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే, వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా, రెండుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఉన్నపళంగా వచ్చి పరామర్శించాలి..వారిని ఆదుకోవాలని తెలియదా అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి.
అదే సమయంలో జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతోనే వెల్లంపల్లి వరద బాధితులను పరామర్శించే సాహసం చేయడం లేదని అంటున్నారు. ఇటీవల జగన్ కృష్ణలంకలో పర్యటించినప్పుడు ఆయన వెంట కనిపించి మళ్లీ ఎక్కడా కనిపించకపోవడంపై విజయవాడ వాసులు వెల్లంపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.