తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడా కూడా.. ఈవీఎంలు మొరాయించాయన్న ప్రస్తావన రాలేదు. చివరికి.. వేల ఈవీఎంలు ఉపయోగించిన… నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కూడా…. వందల మంది ఇంజినీర్లను రంగంలోగి దించి.. ఎలాంటి సమస్యా రాకుండా చేశారు. కానీ.. ఏపీలో మాత్రం… కనీసం నాలుగువేలకుపైగా పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు పని చేయలేదు. వాటిని సరి చేయడానికి ఇంజనీర్లు వచ్చారని… వారు సరి చేసిన తర్వాత పోలింగ్ ప్రారంభమయిందని చెప్పుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కీలకమైన ప్రశ్న వేశారు. అసలు… అన్ని వేల ఈవీఎంలను బాగు చేయడానికి అపాయింట్ చేసిన ఇంజినీర్లు ఎవరు..? ఎక్కడ్నుంచి తీసుకొచ్చారని.. చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఏ ఏ పోలింగ్ బూత్‌లలో… ఎవరెవరు.. ఈవీఎంలను సర్వీస్ చేశారు.. ఎక్కడెక్కడ రీప్లేస్ చేశారు.. ఈ వివరాలన్నీ బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పోలింగ్ జరుగుతున్న బూత్‌లలో కనీసం.. ఆరు నుంచి ఏడు శాతం ఈవీఎంలు మొరాయించడం అంటే…. సామాన్యమైన విషయం కాదని.. ఆయన అంటున్నారు. సర్వీస్ పేరుతో… ప్రి లోడెడ్ ఈవీఎంలు తీసుకొచ్చి పెట్టారని… వాటిని… ఫార్మాట్ చేశారన్న అనుమానాలు చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో…. రెండు సార్లు, మూడు సార్లు మొరాయించినట్లు… ప్రచారం చేయడం…. అదే పనిగా… ఇంజినీర్లను పిలిపించడం కూడా.. అనుమానాలకు తావిస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఈసీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించిన విధానం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎవరూ కూడా సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. ఈసీతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న… వైసీపీ మాత్రమే… ఈసీ ఎన్నికలు నిర్వహించిన విధానం బేష్ అంటోంది. ఓ వైపు ఓటర్లంతా… పడిగాపులు పడుతూ.. ఇబ్బందులు పడినా… వైసీపీ అధినేత ఎందుకలా అంటున్నారో… ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికల ప్రచారాన్ని మానుకుని.. చేసిన కుట్రల ఫలితమని.. టీడీపీ నేతలు అంటున్నారు. ఏం జరిగిందో.. ఎలా బయటకు వస్తుందో…?