జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి యాభై రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని హత్య చేశారని ప్రచారం చేసి వచ్చారు. 36 మంది అంటే చిన్న విషయం కాదు. అంత ఘోరంగా రాజకీయ హత్యలు జరిగాయా అని అశ్చర్యపోయారు. డీటైల్స్ కోసం వైసీపీ నేతలపై ఒత్తిడి ప్రారంభించారు. వారి సోర్స్ ద్వారా ఏపీలో జరిగిన హత్యలు.. ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.. సమాచారం రావడం లేదు. దీంతో వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిపోయింది.
రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ రాష్ట్రపతికి చేరే ప్రతి ఫిర్యాదును.. కేంద్ర హోంశాఖకు పంపుతారు. హోంశాఖ దానిపై ఖచ్చితంగా నివేదిక రెడీ చేయాల్సి ఉంటుంది. వైసీపీ అంతా తప్పుడు వివరాలతో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిందని తెలిస్తే మరింత సమస్య అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్రపతిని కానీ.. ఇటు హోంమంత్రిని కానీై కలిసే ప్రయత్నం చేయకుండా.. గురువారం ఉదయమే విజయవాడకు వచ్చేశారు.
Also Read : జగన్ ఢిల్లీ ధర్నా అసలు స్క్రిప్ట్ ఇదీ !
ఇప్పటికీ జాతీయ మీడియా ప్రతినిధులు ఏపీలో జగన్ చెప్పినంత రాజకీయ హింస జరుగుతోందా అన్న కోణంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపో మాపో జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్టోరీలు టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో గురువారం అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులపై జగన్ హయాంలో పెట్టిన కేసులు హైలెట్ అయ్యాయి. జగన్ హయాంలో జరిగిన ఘోరాలను కూడా జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చి..ఆయన ప్రచారంపై నిజానిజాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి