దేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో అసలు ఆసక్తి చూపించడం లేదు. తమ రాజకీయం తాము చేసుకుంటోంది. కాంగ్రెస్ కూటమి కానీ.. ప్రాంతీయ పార్టీల కూటమి కానీ టీడీపీ తమతో కలిసి వస్తుందని అనుకోవడం లేదు. అందుకే వారు కూడా భేటీలకు ఆహ్వానం పంపడం లేదు. అయితే టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి భారీగా ఓట్లు లేవు. చాలా కొద్దిగానే ఉన్నాయి. ముగ్గురు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేల ఓట్లతో సాధించేదేమీ ఉండదు. అయితే ఆ ఓట్లు కూడా కీలకమయ్యే అవకాశం ఉంది.
మమతా బెనర్జీ ప్రతిపక్షల మీటింగ్ పెట్టుకుని అందర్నీ పిలిచారు. జగన్, చంద్రబాబును మాత్రం పిలువలేదు. చంద్రబాబు జాతీయ రాజకీయాల విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. అసలు ఆ వైపు చూడటం లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయం అనే ఆలోచన కూడా చేయడం లేదు. ముందుగా రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించుకోవడమే లక్ష్యంగా ఆయన పని చేసుకుంటున్నారు. ముందు సీట్లు సాధిస్తే.. తరవాత ఢిల్లీ వ్యవహారాలు చూడాలనుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు చూస్తే.. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్తికే మద్దతిచ్చే అవకాశాలే ఎకకువగా కనిపిస్తున్నాయి. కొద్దిగా ఓట్లు అయినా.. బీజేపీకి ఆ కొద్దిగానే తగ్గాయి. బీజేపీ ఎవరిని ఎంపిక చేసినా.. సామాజికవర్గ కారణమో.. మరొకటో చెప్పి.. ఆ పార్టీ అభ్యర్థికే ఓట్లు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి రిస్క్ రాజకీయాలు ప్రస్తుతం చేసే చాన్స్ లేదని.. రాష్ట్రంలో గెలుపుపైనే తమ దృష్టి అని.. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు పార్టీ నేతలకు సందేశం పంపారు.