శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఇంట్లో భోజనం చేస్తున్న కళా వెంకట్రావు ఇంటిని వందల మంది పోలీసులు చుట్టుముట్టి .. పూర్తిగా భోజనం కూడా చేయకముందే.. బలవంతంగా తీసుకెళ్లారు. ఆయనను ఎంత బలవంతంగా తీసుకెళ్లారో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ అందరికీ గుర్తొచ్చింది. అరెస్ట్ చేసినట్లుగా చెప్పిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. చివరికి చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్ బెయిల్ ఇస్తున్నట్లుగా చెప్పి … స్టేట్మెంట్ తీసుకుని విడుదల చేశారు. ఇంత బలవంతంగా అరెస్ట్ చేయడం ఎందుకు..? స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడం ఎందుకు..? .. ఇంత అలజడి రేపాల్సిన అవసరం ఎందుకన్నదే ఇప్పుడుచాలా మందిలో ఉన్న సందేహం.
కళా వెంకట్రావు సౌమ్యుడు. ఎవరితోనూ కనీసం పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు. కనీసం గొంతు పెద్దది చేసి గద్దించే స్వభావం కూడా కాదు. సాధారణంగా రాజకీయాల్లో ఉంటే… రాస్తారోకో.. ధర్నా కేసుల్లాంటివైనా ఉంటాయి. కానీ.. కళా వెంకట్రావు మీద .. ఆయన రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క కేసు లేదు. కానీ రామతీర్థం కొండ కింద.. ఎవరో వాటర్ బాటిళ్లు, చెప్పులు వేశారని . .. దానికి కళా వెంకట్రావు కారణం అని ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసులో ఇతరుల్ని అరెస్ట్ చేశారు. తర్వాత కళాను కూడా అరెస్ట్ చేశారు. కళాను అరెస్ట్ చేశారన్న విషయం బయటకు తెలిసిన తర్వాత చాలా మందిలో పోలీసులు తప్పు చేస్తున్నారన్న అభిప్రాయమే వినిపించింది.
మామూలుగా నోటీసులు ఇస్తే విచారణకు వస్తారు. పోలీసులు ఎవరైనా అదే చేస్తారు. కానీ ప్రభుత్వ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చినట్లుగా సృష్టించుకుని.. అరెస్ట్ చేయాలన్న తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోంది. ఇప్పుడు కళా వెంకట్రావు విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మందికి… టీడీపీ నేతల్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని… అదీ కూడా భయభ్రాంతులకు గురి చేసేలా మానసికంగా వేధిస్తూ అరెస్ట్ చేయాలని లక్ష్యం. అలా చేసినప్పుడు… అదో రకంగా సంతోష పడతారని చెబుతారు. ఆ సంతోషం కోసం.. ఇలాంటి అరెస్టులు జరుగుతూ ఉంటాయన్న చర్చ కూడా నడుస్తోంది.
మూడు వారాల కిందట… ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అప్పటి వరకూ ఆయన పులివెందులలోనే ఉన్నారు. ఆయన చెన్నై వెళ్తున్నాడని తెలిసి… అక్కడి ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి.. విజయవాడకు వచ్చి టీడీపీ సమావేశాల్లో పాల్గొంటారని తెలిసి… లాంజ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. అదేం పద్దతని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కానీ.. ఏపీలో పోలీసుల్ని వాడుకుని చేస్తున్న భయభ్రాంతుల రాజకీయంలో ఇదో భాగమని ఆయన తర్వాత గుర్తించారు. ఇప్పుడు కళా వెంకట్రావు విషయంలోనూ అదే జరిగింది. పోలీసులతో తాము ఏమైనా చేయగలమన్న ఓ భయాన్ని ప్రతిపక్ష నేతల్లో సృష్టించడానికి… పోలీసుల్ని నిస్సంకోచంగా వాడుకుంటున్నారని స్పష్టంగా తేలిపోతోంది.