కల్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ ‘బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు. ‘బింబిసార-2’ మరింత భారీ స్థాయిలో.. అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో ఉంటుంది’ అని కళ్యాణ్ రామ్ ఇదివరకే ప్రకకటించారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐతే ఇప్పుడీ సినిమాకి దర్శకుడు మారాడు. పార్ట్ 1కి దర్శకత్వం వహించిన వశిష్ఠ్ పార్ట్ 2 ని చేయడం లేదు. తనకి వున్న వేరే కమిట్మెంట్స్ కారణంగా సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. కళ్యాణ్ రామ్ మరో దర్శకుడి వేటలో వున్నారు. బింబిసార-2 కథ వశిష్ఠ్ దే. స్క్రిప్ట్ లో ఆయన కూర్చుకున్నారు. డైరెక్షన్ మాత్రం చేయడం కుదరడం లేదు. అన్నట్టు బింబిసార-2కి డిస్నీ హాట్ స్టార్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా చేరుతోంది.