మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇక దందాల నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నాడట. అందుకే తన 10 బిలియన్ డాలర్ల చీకటి సామ్రాజ్యానికి వారసుడిని ప్రకటించబోతున్నాడు. తన 60వ పుట్టిన రోజు సంద్భంగా పాకిస్తాన్ లోని కరాచీలో శనివారం నాడు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా తన తమ్ముడు అనీస్ ను వారసుడిగా ప్రకటిస్తాడని ఊహాగానాలు వినవస్తున్నాయి.
దావూద్ తమ్ముళ్లలో ఒకడు ఇదివరకే చనిపోయాడు. మరో ముగ్గురు అతడితోనే ఉంటున్నారు. వీరిలో అనీస్ చురుకైన వాడు. అన్ని విధాలుగా అన్నకు చేదోడుగా ఉంటాడు. మిగతా ఇద్దరూ అంత చురుకైన వారు కాదు. అందుకే అనీస్ ను తదుపరి డాన్ గా ప్రకటిస్తాడని టాక్. శనివారం నాటి పార్టీకి పాక్ లోని చాలా మంది ప్రముఖులు, దుబాయి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక అతిథులు తరలివస్తారట.
ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్, భారత్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇప్పుడు కరాచీలో ఐఎస్ఐ ప్రత్యేక రక్షణలో ఉన్నాడు. పాక్ ఆర్మీ, ప్రత్యేక కమెండోలు అతడి కుటుంబాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయినా, భయం భంయంగానే బతుకుతుంటాడు. కరాచీలోనే తరచూ ఇల్లు మారుతుంటాడట. అలాటి డాన్ తన బర్త్ డే సందర్భంగా వారసుడిన ప్రకటిస్తాడని ముంబై పోలీసులకు, ఇక్కడి అండర్ వరల్డ్ తో సంబంధం ఉన్న వారికి సమాచారం అందింది. ముంబై పోలీసులు అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే పనిలో ఉన్నారు.