వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఉండటానికి అవినాష్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు నవరసాలు నిండిన సినిమాగా కనిపిస్తోంది. ఇదంతా యాధృచ్చికంగా జరుగుతున్నది కాదని.. ఖచ్చితంగా ఓ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందని ఎవరికైనా అయిపోతుంది. అయితే ఈ సన్నివేశాలను.. స్క్రీన్ ప్లేను ఎవరు డిజైన్ చేస్తున్నారన్నరది వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారంది. మొత్తంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఓ సీనియర్ సలహాదారుడు ఈ మొత్తం సీన్లను డీల్ చేస్తున్నారని చెబుతున్నారు.
మొదట అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్లకుండా తల్లికి గుండెపోటు పేరుతో క్లైమాక్స్ సీన్ ఇంటెన్సిటీనే మొదటి సీన్ లో తెచ్చేశారు. అక్కడ్నుంచి ఇక డ్రామాలే డ్రామాలు. కర్నూలు తీసుకొచ్చి విశ్వభారతి ఆస్పత్రిలో ఉంచడం..చుట్టూ మనుషులు కదలకుండా.. కూర్చోవడం ఎవరూ అవినాష్ రెడ్డి నీడను కూడా తాకకుండా చేయడం అంతా వ్యూహంలో భాగమే. ఈ లోపు తల్లి సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చి ఫ్లెక్సీలు పోస్టర్లు వేయించారు. తల్లి ప్రేమ గురించి ఆస్పత్రి ముందు అడ్డంగా పడుకున్న రౌడీలు పోస్టర్లు ప్రదర్శించడం అందర్నీ అబ్బుర పరుస్తోంది.
ఇలా జరుగుతూండగానే.. కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు బంధువుల పేరుతో తెరపైకి వస్తున్నాయి. విమలారెడ్డి అనే ఆమె కొత్తగా తెరపైకి వచ్చారు. ఆమె వివేకానందరెడ్డి సోదరి కూడా. అయితే అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు. ఆయనకే తెలియదని.. సునీతదే తప్పన్నట్లుగా మాట్లాడారు. ఆమె మాటల్ని నీలి మీడియా ఎప్పట్లానే హైలెట్ చేసింది. అయితే సలహాదారుడు అసలు తాము చేస్తున్న సీన్స్ వల్ల.. సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా ఉంటాయని ఊహించలేకపోతున్నారన్న అబిప్రాయాన్ని ఎక్కువ మంది వినిపిస్తోంది.
విచారణకు సహకరించకుండా ఇలాంటి కబుర్లు చెప్పడం వల్ల న్యాయవ్యవస్థ సానుకూలంగా స్పందించే అవకాశం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని..అందరికీ అర్థమైపోతుందంటున్నారు. కారణం ఏదైనా అవినాష్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో నవరసాలు ఉన్నాయని అంటున్నారు.