చేతన్ భగత్ రాసిన కథకు పదునైన కథనాన్ని సిద్ధం చేసి, సరైన తారాగణాన్ని ఎంపిక చేసి, దర్శకత్వం వహించడం అంటే గొప్ప విషయమే. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా దర్శకుడు మోహిత్ సూరీ దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు. అయితే సదరు అర్ధ ప్రేయసి, అదే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరనేదే సస్పెన్స్.
మొదట దీపికా పదుకొనే అయితే బెటర్ అనుకున్నారు. దీంతో ఆమెకు వర్తమానం పంపారు. మాటా మంతీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈలోగా మోహిత్ మరో జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకైనా మంచిదని కత్రినీ కైఫ్ కు కూడా ఈ సబ్జెక్ట్ వివరించి లైన్లో పెట్టాడట. ఒకవేళ దీపికా నో అంటే కత్రినతో ఎస్ అనిపించాలనేది అతడి ప్రయత్నం.
ఈ ఇద్దరు అందాల భామల్లో ఎవరైనా ఆ పాత్రకు ఓకే అనేది దర్శకుడి ఉద్దేశం. ఇంతకీ అర్ధ ప్రేయసికి ప్రియుడిగా నటించేది ఎవరనేది కూడా ఇంకా ఖాయం కాలేదు. వరుణ్ ధావన్ మొదట సంప్రదించారని, అతడు డేట్స్ లేవన్నాడని బాలీవుడ్ టాక్. అయితే, వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తారనే ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదంటున్నాడు దర్శకుడు. ఇంతకీ దీపిక, కత్రినాల్లో ఎవరు సగం గర్ల్ ఫ్రెండ్ గా వెండితెర మీద కనువిందు చేస్తారో చూడాలి