‘ఖుషి’లో పవన్ కల్యాణ్ పేరు.. సిద్దార్థ్ రాయ్! సిద్దూ .. సిద్దార్థ్ రాయ్… అంటూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొనే విధానం… చాలా మాసీగా ఉంటుంది. పైగా… ఆ తరహా ఇంట్రడక్షన్ అంతకు ముందు ఏ తెలుగు హీరోకీ లేదు. ఓ హీరోకి ఇచ్చిన పవర్ ఫుల్ పేరు అది. ఇప్పుడు ఆ పేరునే టైటిల్ గా రిజిస్టర్ చేయించారు హరీష్ శంకర్. మైత్రీ మూవీస్ లో `సిద్దార్థ్ రాయ్` అనే పేరు రిజిస్టర్ చేయించాడు హరీష్. ఈ పేరు పవన్ కి తప్ప ఇంకెవ్వరికీ సూట్ అవ్వదు. మరి పవన్‌తో ఈ సినిమా హరీష్ చేయగలడా?
ఇప్పటికే `భవదీయుడు భగత్ సింగ్` పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ కథపై హరీష్ చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. ఈ కథ పవన్ కి తప్ప ఇంకెవ్వరికీ సూట్ అవ్వదు కూడా. సో.. ఈ సినిమా ఇప్పుడు ఆలస్యం అవ్వొచ్చుగాక. కానీ ఎప్పటికైనా పవన్‌తోనే ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. మరి పవన్‌కి మాత్రమే సూటయ్యే.. సిద్దార్థ్ రాయ్ టైటిల్ ఎప్పుడు వాడుకొంటాడో? ఆ సినిమా ఎప్పుడు తీస్తాడో చూడాలి.