జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ని నియమిస్తూ నిన్ననే అధినేత పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. వైకాపాకి ప్రశాంత్ కిషోర్ ఎంతో… జనసేనకి ఈయన అంతే అనే స్థాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇక, దేవ్ మాట్లాడుతూ… తనకు తెలుగు సరిగా రాదనీ, కొంచెం కొంచెం వచ్చు అనట్టుగా ఇంగ్లిష్ లో ప్రసంగించారు. గడచిన దశాబ్దకాలంలో తనకు కొన్ని జాతీయ, అంతర్జాతీయ పార్టీలకు పని చేసిన అనుభవం ఉందన్నారు. ఎన్నికలు, సర్వేలు, వ్యూహాలు.. ఇలాంటి విషయాల్లో తనకు చాలా చాలా అనుభవం ఉందని కూడా చెప్పుకున్నారు. తనకు ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి… తన వ్యూహాలు, ఇన్ పుట్స్, పవన్ కల్యాణ్ ఆలోచనలూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. అందరం కలిసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని చెప్పారు. అతనికి 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటికల్ స్త్రాటెజీస్ కంపెని ఉందని కూడా పవన్ చెప్పారు.
ఇదీ దేవ్ ఇంట్రొడక్షన్..! దీంతో ఈ దేవ్ ఎవరూ..? ప్రశాంత్ కిశోర్ స్థాయి ఎన్నికల వ్యూహకర్తా..? ఆయన ఇంతకాలం సేవలందించిన జాతీయ పార్టీలేవి, అంతర్జాతీయ పార్టీలేవి..? తడబడుతూ తెలుగు మాట్లాడుతున్నారంటూ… ఇన్నాళ్లూ ఈయన ఎక్కడున్నట్టు, ఈయన పుట్టి పెరిగిందెక్కడ.. అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, అసలు విషయం ఏంటంటే… ఈ దేవ్ అసలు పేరు ఏమనగా.. వాసుదేవ్..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింతల్ బస్తీ, తెలంగాణ, మన పక్కా లోకల్! తెలుగులో మాట్లాడటం భేషుగ్గా వచ్చు. గతంలో ఈయన భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆ సందర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రాజనరసింహకి బంధువు.
సో.. ఇదండీ ఈయన నేపథ్యం. మరి, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాననీ, సర్వేలు చేయించాననీ, దశాబ్దకాలం అనుభవం ఉందనీ… జాతీయ పార్టీలేం ఖర్మ, అంతర్జాతీయ పార్టీలతో పనిచేసిన అనుభవం తనదని పరిచయం చేసుకోవడం విడ్డూరం..! ఇంకా విచిత్రం ఏంటంటే… చక్కటి తెలంగాణ మాండలికంలో మాట్లాడటం వచ్చి కూడా తనకు తెలుగు పెద్దగా రాదని చెప్పుకోవడం!
టీవీ చర్చల్లో అప్పుడప్పుడూ పాల్గొనే ఒక సాధారణ స్థాయి కార్యకర్తను తీసుకొచ్చి… వ్యూహకర్త అని పవన్ పరిచయం చేయడం ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. తన గురించి భారీ బిల్డప్పులు ఇచ్చుకుంటూ పవన్ ని ఆయనే బుట్టలో పడేశారా, లేదా దేవ్ నియాకమం వెనక కూడా భాజపా కనెక్షన్ ఉందా..?
.@JanaSenaParty chief strategist Dev Vasudev deleted all the videos from his YouTube account in 30 min after Telugu360 expose.
We’ve ample proofs and more.
Here is a video, courtesy @TV9Telugu where he “struggles” to talk Telugu. pic.twitter.com/FvrzPiI0wf
— Telugu360 (@Telugu360) May 2, 2018
When Dev ( Vasudev ) Joining BJP