ఈ దీపావళికి మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు కూడా దేనికవే డిఫరెంట్ జోనర్ సినిమాలు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఫైనాన్షియల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకి ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యకాలంలో యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చిన సినిమా ఇదే.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చింది కిరణ్ అబ్బవరం ‘క’. కాస్త వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. అయితే సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమాల్లో ‘క’ చాలా బెటర్ పొజిషన్లో నిలిచింది.
శివ కార్తికేయన్ అమరన్ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథగా వచ్చిన ఈ సినిమాలో ఆర్మీ, దేశభక్తి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ.
ప్రశాంత్ నీల్ కథతో శ్రీమురళి హీరోగా వచ్చిన కన్నడ సినిమా బఘీర. సూపర్ హీరో జోనర్ లో వచ్చిన ఈ సినిమా మిగతా మూడు సినిమాలతో పోల్చుకుంటే తక్కువ రేటింగ్స్ తెచ్చుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హాయ్ స్టాండర్డ్స్ లో ఉన్నప్పటికీ రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. నిజానికి అమరన్ కంటే బఘీర సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరికాయి. కానీ ఆ అడ్వాంటేజ్ ని ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది.
మొత్తానికి చూసుకుంటే ఈ దీపావళికి సక్సెస్ పర్సంటేజీ ఎక్కువే. లక్కీ భాస్కర్, క, అమరన్, ఈ మూడు సినిమాలు కూడా డీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద రన్ అవుతున్నాయి. ఈ మూడిట్లో యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న లక్కీ భాస్కర్ ఈ దీపావళి విన్నర్ అని చెప్పొచ్చు.