ఆంజనేయుడి జన్మస్థలం విషయంలో ఏకపక్షంగా టీటీడీ చేసుకున్న ప్రకటన ఇప్పుడు వివాదాస్పదవుతోంది. ఇప్పటి వరకూ కర్ణాటక రాష్ట్రంలోని పంబా క్షేత్రంలోని కిష్కింద హనుమంతుని జన్మస్థలంగా చెప్పుకుంటున్నారు. అయితే టీటీడీ … తిరుమలలోని అంజనాద్రిని ప్రకటించడం.. దానికి పురాణాలను సాక్ష్యంగా చూపించడంతో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆగ్రహంతో ఊగిపోయింది. అటో ఇటో తేల్చేసుకోవాడనికి ట్రస్ట్ నుంచి స్వామీజీ గోవిందా నంద సరస్వతి తిరుమల వచ్చారు. ఆయనతో టీటీడీ .. హనుమంతుని జన్మస్థలాన్ని అంజనాద్రిగా నిర్ధారించిన కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. మీడియాను అనుమతించడం.. అంతర్గతంగానే వాదన నిర్వహించడంతో పాటు.. టీటీడీ వాదను తిరస్కరించి… గోవిందానంత బయటకు వచ్చేశారు.
మీడియా ముందు టీటీడీ వాదనను తప్పు పట్టారు. టీటీడీ చెప్పిన విషయాల్లో ప్రామాణికం లేదని.. కాల విషయంలో క్లారిటీ లేదు.. మూడు తిధులు రాశారు.. జన్మ తేదీ లేనప్పుడు స్థలం ఎలా స్థిరీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. హనుమంతుడు జన్మ విషయంలో పురణాలతో తేల్చలేమని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీటీడీ శంకరాచార్యులను ఆడిగిందా?.. కనీసం తిరుమల పెద్ద జీయర్ను ఆడిగారా అని గోవిందానంద సరస్వతి నిలదీశారు. రామాయణంలో జన్మ స్థలం పంపా అని ఉందని.. రామాయణాన్ని టీటీడీ ప్రమాణంగా తీసుకోవడం లేదు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఠాధిపతుల సమక్షంలో నిర్ణయం జరగాలని.. ఎవరు పడితే వారు కమిటీలు వేసి గంభీర విషయాల్లో నిర్ణయం చేయకూడదు తేల్చి చెప్పారు.
సరస్వతి శంకర, రామానుజ, మద్వ పీఠాలను, పీఠాధిపతులను ఇన్వాల్వ్ చేయాలిని.. వారు మాత్రమే నిర్ణయం తీసుకోగలరని ాయన స్పషఅటం చేశారు. కర్ణాటకలో కూడా అంజనాద్రి ఉంది, ఆ ప్రభుత్వాన్ని అడిగారా?.. నెగ్గడం, ఓడిపోవడం కాదు.. సత్యం తేలాలని ఆయన స్పష్టం చేశారు. గోవిందానంద స్వామి వాదనలతో టీటీడీ ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది. ఏకపక్షంగా హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని ప్రకటించుకున్న టీటీడీ ఇప్పుడు… అనవసరంగా వివాదాలు స్పష్టించినట్లయింది.