రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు ఓ కొత్తపేరు హాట్ టాపిక్ గా మారుతోంది. తనను అరెస్టు చేసిన కలెక్షన్ ఎజెంట్ అయిన కామేపల్లి తులసి అనే భారీకాయుడ్ని తనపై కూర్చోబెట్టారని రఘురామ ఆరోపించారు. ఆయన ఇప్పుడు గుడివాడలో దందాలు చేస్తున్నారని కూడా రఘురామ ఆరోపించారు. ఈ కారణంగా అసలు ఈ కామేపల్లి తులసీ ఎవరు అన్నదానిపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.
కామేపల్లి తులసీ – ఐపీఎల్ సునీల్ సన్నిహితుడు !
రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు పోలీసుల కన్నా బయట వ్యక్తులే వచ్చి టార్చర్ చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు. అలా వచ్చిన వ్యక్తి కామేపల్లి తులసి. ఆయన పోలీసు డిపార్టుమెంట్లో ఉద్యోగికాదు. కానీ అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కు మాత్రం అత్యంత సన్నిహితుడు అని పోలీస్ డిపార్టుమెంట్లో అందరికీ తెలుసని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు గుడివాడలో ఏం చేస్తున్నారు ?
ఇప్పుడు గుడివాడలో ఈ కామేపల్లి తులసి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు సన్నిహితునిగా ఉంటూ నియోజకవర్గంలో వ్యవహారాలు చక్క బెడుతున్నరాని చెబుతున్నారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. గుంటూరులో చేసిన ఓ డీల్ సమయంలో వెనిగండ్ల రాముకు ఆయన పరిచయం అయ్యారని అప్పట్నుంచి దగ్గరయ్యారని అంటున్నరు.
పీవీ సునీల్‌కు.. వెనిగండ్ల రాముకూ సాన్నిహిత్యం?
ఏపీ రాజకీయాల్లో చాలా మందికి తెలియనిది ఏమిటంటే.. టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఐపీఎల్ సునీల్ కుమార్ కూ సాన్నిహిత్యం ఉందని. వారిద్దరికి పరిచయం ఉందని.. ఈ కారణంగానే తులసీ టీడీపీ ఎమ్మెల్యేకు మరింత దగ్గరయ్యారని అంటున్నారు. వెనిగండ్ల రాము భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు. ఆయన మామకు చర్చిల్లో పలుకుబడి ఉంది. ఈ క్రమంలో పరిచయాలు పెరిగి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు.
కారణం ఏదైనా ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కామేపల్లి తులసి పేరును రఘురామ బయట పెట్టే వరకూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు జరగబోయే పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.