చికోటి ప్రవీణ్ వ్యవహారం ఆగకుండా సాగుతూనే ఉంది. ఆయనను నాలుగు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే జారీ చేశారో లేదో స్పష్టత లేదు. కానీ చికోటి ప్రవీణ్ మాత్రం తన ప్రాణానికి ప్రమాదం ఉందని హైకోర్టును ఆశ్రయించారు. రక్షణ కావాలని వేడుకున్నాడు. గన్మెన్ల కోసం అలా చేశాడా లేకపోతే.. నిజంగానే ప్రాణహాని ఉందా అన్నదానిపై క్లారిటీలేదు.
చికోటి చేసిన బిజినెస్ ఆయన చెప్పుకుంటున్నట్లుగా లీగల్ ఏమీ కాదు. గోవాలో ఇతర దేశాల్లో లీగర్. ఇక్కడ నిర్వహించడం లీగల్ కాదు. ఆయన సీక్రెట్లో ఇక్కడకూడా కేసినోలు నిర్వహిస్తారని గుడివాడ అంశంతోనే తేలిపోయింది. గతంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసినో లింకులతో … వందల కోట్ల హవాలా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. వాటి గుట్టు బయటకు లాగాలనుకుంటోంది. అదే బయటపడితే.. చాలా మంది పెద్దలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.
ఆ పెద్దలు వయోలెంట్ కాబట్టి.. తనకు ప్రాణహాని ఉందని చికోటి ప్రవీణ్ భయపడుతున్నారని అందుకే హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు. ప్రవీణ్ వ్యవహారంపై వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. కానీ అందరూ ఖండించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేస్తే కానీ వారెవరో స్పష్టత వచ్చే అవకాశం లేదు.