తండ్రిని అత్యంత ఘోరంగా చంపేశారు. చంపింది ఎవరో తెలుసుకునేందుకు .. వారిని చట్టపరంగా శిక్షించేందుకు పోరాడుతూంటే ఆమెపైనే నిందలేస్తున్నారు. హత్యను ఆమె చేశారని అంటున్నారు. కేసులు పెట్టారు. అనేక రకాలుగా వేధిస్తున్నారు. అయినా ఆమె పోరాటం ఆపడం లేదు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లాలనుుంటే.. ఆ కవరేజీ రాకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తగ్గడం లేదు. తన తండ్రి హత్యపై ఆమె సూటిగా అడుగుతున్నప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది.
వివేకానందరెడ్డి హత్య కేసును చాలా సులువుగా పరిష్కరించవచ్చు. కానీ దర్యాప్తు అధికారులు వారి పని వారిని చేయనివ్వకుండా చూస్తూ.. అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయగలిగినది అంతా చేశారు. ఇదంతా ఎందుకు చేశారు ?. ఘోరంగా నరికి చంపారని తెలిసిన తర్వాత కూడా గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు ? . సునీత రాకుండానే .. పోస్టుమార్టం చేయకుండానే .. చివరికి కేసు కూడా లేకుండా అంత్యక్రియలు నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు ?. వీటితో పాటు జగన్ రెడ్డి తనకు పన్నెండో కేసు అవుతుందని ఎందుకన్నారో కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంది.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండటమే కాదు.. సొంత కుటుంబసభ్యుడ్ని దారుణంగా నరికి చంపితే.. నిందితుల్ని కాపాడే ప్రయత్నం నైతికంగా దివాలా తీయడమే. హంతకులు ఎవరినైనా కాపాడాలి అని పాలకుని పొజిషన్ లో ఉన్న వారు అనుకుంటే అంత కంటే అరాచకం ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. సునీతపై ఎదురుదాడి చేసి.. ఆమెపై ఆరోపణలు చేసి.. తన పత్రికలో ఇష్టం వచ్చినట్లుగా రాయిస్తే పని కాదు. అుమానితులుగా… సునీతను.. ఆమె భర్తను కూడా సీబీఐ ప్రశ్నించింది. అంతా అయిన తర్వాతనే నిందితుల్ని తేల్చారు.
విసిగి వేసారిపోయి.. మరోసారి జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందన్న భ యంతో ఆయనకు ఓటేయవద్దని..తమకు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ? . దీనికి జగన్ రెడ్డి కి బాధ్యత లేదా ?. ఆయన ఎం సమాధానం చెబుతారు ?