అరెస్టు చేసినా నాయకుడు గట్టిగా నిలబడితేనే కార్యకర్తలకు ధైర్యం ఉంటుంది. నేరుగా వచ్చి ప్రభుత్వంపై పోరాడే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీలో నాయకులు అంతా తేడాగా ఉన్నారు. కేసు నమోదు కాగానే పరారవుతున్నారు. హైకోర్టు,సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ అయితే బయటకు వస్తున్నారు. లేకపోతే లేదు. అందరూ ఇలా పారిపోయి బెయిల్ ప్రయత్నాలు చేయలేరు. కార్యకర్తలు అసలు చేయలేరు. మరి వారికి ఎవరు భరోసా ?
కిందిస్థాయి కార్యకర్తలతో వైసీపీ నేతలు చేసిన దాడులు, బూతుల రాజకీయాలు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. కాస్త ఓ స్థాయి రాజకీయనేతలు అయితే అవినీతి చేసి దోచుకున్న వ్యవహారం బయటకు వస్తోంది. ఇలా దోచుకున్న వాళ్లు పారిపోతున్నారు. వారిని నమ్ముకున్న వాళ్లు మాత్రం ఎటూ పోలేక.. జైలుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పేర్ని నాని బియ్యం మాయం కేసులో పరారయ్యారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా రావడం లేదు. కానీ పేర్ని నానిని నమ్ముకుని బందరులో అన్ని అడ్డగోలు పనులు చేసిన వారు మాత్రం.. ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
నిజానికి పేర్ని నాని ధైర్యంగా నిలబడి ఉంటే పోలీసులు అరెస్టు చేసి ఉండేవారేమో?. కానీ ఆ అరెస్టులు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడేవి. కొల్లు రవీంద్ర మీద హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపితే ఆయనకు ప్లస్ అయింది. బియ్యం దొంగతనం కేసులో పేర్ని నానిని, ఆయన భార్యనూ అరెస్టు చేస్తే ఆయనకు ఇంకా ప్లస్ అవుతుంది. తన భార్యనూ అరెస్టు చేశారని ఆయన ప్రజల మనసుల్ని సానుభూతితో కదిలిచుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆయన పరారయ్యి.. క్యాడర్ లో ఇమేజ్ చెడగొట్టుకున్నారు