చిరంజీవి 150వ సినిమాకి అంతా ఓకే అయిపోయింది. శ్రీజ పెళ్లి అవ్వగానే సినిమా పట్టాలెక్కేయడం ఖాయం. ఈ సినిమా కోసమే చిరు గెడ్డం కూడా పెంచి రఫ్‌లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. చిరంజీవికి తగిన కథానాయిక ఎవరన్నది ఇంకా తేలడం లేదు. నయన తార ఓకే అనుకొన్నా.. పారితోషికం విషయంలో బాగా పేచీ పెట్టడంతో ఆమెను పక్కన పెట్టారు. అనుష్క సంగతీ దాదాపుగా అలానే తయారైందని టాక్. అనుష్క ఈ సినిమాలో నటించాలో, వద్దో ఇంకా నిర్ణయం తీసుకోలేదట. `కాస్త ఆలోచించి చెప్తా..` అంటూ వినాయక్‌కి సర్దిచెప్పుకొస్తోందట.
నయన, అనుష్క అనే కాదు. దాదాపుగా టాప్ హీరోయిన్లంతా చిరంజీవి అంటే భయపడుతున్నారు. చిరు ఏజ్ ఎక్కువగా కనిపిస్తోంది. చిరుపక్కన నిలబడితే.. మన ఏజ్ ఎక్కడ పెరిగిపోతుందో.. అని కథానాయికల భయం. పైగా చిరు సినిమాలో తమకెంత స్కోప్ ఉంటుందో వాళ్లకూ తెలిసిందే. చిరు 150వ సినిమా అనగానే అందరి కళ్లూ అటువైపే ఉంటాయి. కథానాయిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు. ఎంత చేసినా.. గుర్తింపు రాదు. పైగా చిరు సినిమా అంటే ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకొచ్చిన రిస్కూ… అని కథానాయికలంతా చిరుని లైట్ తీసుకొంటున్నార్ట. చిరు చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్ కీ ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు నయనతారని సంప్రదించి, స్టార్ హీరోయిన్లందరితోనూ కాదనిపించుకొని ఓ కొత్తమ్మాయిని తెచ్చిపెట్టుకొన్నారు. ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుద్దా??? డౌటే.