“ఈయన పేరు ప్రశాంత్ కిషోర్. మోడీని ప్రధానమంత్రిని చేశాడు.. ఇప్పుడు నన్ను గెలిపిస్తారు..” కొన్నాళ్ల క్రితం… ప్లీనరీలో జగన్ తన క్యాడర్ ను ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవి.
” ఈయన పేరు కేసీఆర్. ఈయన చంద్రబాబును తెలంగాణలో ఓడించి గెలిచారు. రేపు ఏపీలో చంద్రబాబును ఓడించి నన్ను గెలిపించబోతున్నారు..” తన క్యాడర్‌కు నేరుగా కాకపోయినా… స్పష్టంగానే జగన్ ఈ సూచనలు పంపుతున్నారు.
ప్రత్యక్షంగా అయినా.. పరోక్షంగా అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో తన గెలుపు అనేది.. ఇతులు సాధించి పెడతారనే భావిస్తున్నారు. గొప్ప ఎన్నికల స్ట్రాటజిస్ట్ అని ప్రశాంత్ కిషోర్‌ను.. చాలా పెద్ద మొత్తానికే… తెచ్చుకున్న జగన్‌కు.. ఆయన ప్రణాళికాలు అంత గొప్పగా… పని చేయలేదని అర్థం కావడానికి చాలా కాలం పట్టింది. సర్వేలు, అభిప్రాయసేకరణల పేరుతో.. పార్టీ మొత్తానికి పీకే చేతిలో పెట్టినా…. పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. కనీసం అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవడానికి అవసరమైన సమాచరాం కూడా… పీకే టీం ఇవ్వలేదు. దాంతో.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి… “డబ్బు” అనే కొలమానం పెట్టుకుని అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పుడు పీకేపై.. ఆశలు సన్నగిల్లే లోపే.. తనను గెలిపించడానికి కేసీఆర్ ముందుకొచ్చారని జగన్ సంబర పడిపోతున్నారు.
కేసీఆర్ లక్ష్యం చంద్రబాబు ఓటమి. కేసీఆర్ ఏపీలో పోటీ చేయలేడు కాబట్టి.. వేరే వాళ్లను గెలిపించాలి. దానికి ఆయన జగన్‌ను ఎంచుకున్నారు. జగన్‌తో పవన్ కల్యాణ్‌ను కలిపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పారు కూడా. ఇక తన దృష్టిలో కేసీఆర్ హీరో కాబట్టి.. చంద్రబాబును ఎలాగైనా ఓడించి తనను సీఎంను చేస్తారన్న గట్టి నమ్మకంతో… జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్‌పై అమితంగా ఆధారపడిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడిపోతున్నారు. తాను సొంతంగా.., రాజకీయం చేస్తే గెలుస్తానో లేదో అన్న నమ్మకం లేకపోవడంతో.. ఇతరులు ఎవరైనా వచ్చి గెలిపిస్తారేమోన్న ఆశతో.. జగన్మోహన్ రెడ్డి… ఉన్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతున్నాయి. ఓ సందర్భంలో పార్టీని పీకే అప్పగించేశారు. ఇప్పుడు.. కేసీఆర్ చేతుల్లో పెట్టేస్తున్నారు. మొత్తానికి ఎవరో ఒకరు గెలిపిస్తారని ఆశ పడుతున్నారు.