వ్యవసాయం చాలా కష్టం.. మీరొక్కరే వెళితే ఎలా.. మీతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డిలను కూడా తీసుకెళ్లండి అని వైసీపీలోని కొంత మంది ప్రస్తుత నేతలు.. మాజీ నేతలు విజయసాయిరెడ్డికి సెటైరికల్ సలహాలు ఇస్తున్నారు. వారు వ్యంగ్యంగా చెబుతున్నప్పటికీ.. పార్టీని భ్రష్టుపట్టించిన నేతలు అందరూ రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని వైసీపీని కొంత మందినేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. వాలంటీర్లను పెట్టారు. పార్టీ నేతల్ని డమ్మీలను చేశారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్ని పెడితే వారి శాఖలేవో వారికి తెలియనంతగా చేశారు. అంతా సకల శాఖా మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహిరంచారు. సంపాదన మాత్రమే జగన్ చూసుకున్నారు. ఇలాంటి పరిపాలనతో పాటు కక్ష సాధింపులకు పాల్పడి.. అధికారం పోతే నేతలు, క్యాడర్ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచన చేయలేదు. ఇప్పుడు జైళ్లకు వెళ్తున్నవారిని పట్టించుకునేవారు కూడా లేరు.
ఈ సీనియర్ల స్క్రాప్ అంతాపార్టీని విడిచిపోయి వ్యవసాయం చేసుకుంటే మంచిదని ఎక్కువ మంది కోరుకంటున్నారు. వారు పార్టీలో ఉండటం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నారు. దోపిడీ చేసి అడ్డంగా దొరికిపోయిన కొంత మంది కూటమి పార్టీలతో సంప్రదింపులు జురుపుతూ .. రిటైరయ్యేందుకు కూడా సిద్ధమని సంకేతాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజుల్లో విజయసాయిరెడ్డితో కలిసి సామూహిక సాగు కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.