ఢిల్లీలో కలసి వచ్చే పార్టీలని కలుపుకోవాలని జగన్ తన పార్టీ ఎంపీలకు చెప్పారు. ఎంపీలు తలూపి వచ్చారు. కానీ వారితో కలసి వచ్చే పార్టీ బీర్ఎస్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి దగ్గర్నుంచి కేటీఆర్ ఇంకా ఏదో ఆశిస్తున్నారు.. అందుకే ఒకప్పుడు జఫ్ఫాలుగా ప్రచారం చేసిన వారికే ఇపపుడు హైప్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. బీఆర్ఎస్ ను పక్కన పెడితే జాతీయ స్థాయిలో వైసీపీ దగ్గరకు వచ్చి మద్దతు పలికేవారు లేరు. ఇండీ కూటమి వచ్చి మద్దతు పలికితే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడతారు. వారిని రమ్మనలేరు.
జగన్ రెడ్డి చేస్తున్న సంకర రాజకీయం వల్ల ఆయనకు ఢిల్లీలో మిత్రులు లేరు. కనీసం సానుభూతి చూపించేవారు లేరు. కేసుల భయంతో ఆయన బీజేపీ కాళ్లు పట్టుకుని వదలడం లేదు. టీడీపీ , జనసేన కూటమి ఎన్డీఏలో ఉన్నా మా మద్దతు మీకే అని వెంట పడుతున్నారు. కానీ ఆయనకు సపోర్టు చేసేందుకు బీజేపీ రెడీగా లేదు. తమ కూటమి ప్రభుత్వంపై జగన్ ధర్నా చేస్తే… ఎన్డీఏ ఎందుకు మద్దతిస్తుంది ?. పోనీ కాంగ్రెస్ వాళ్లను అయినా పిలుద్దామంటే… అంత కంటే.. జైలుకెళ్లడం మంచిదని జగన్ ఫీలవుతారు. ఇండి కూటమితో జగన్ ఏ మాత్రం సఖ్యతగా ఉన్న సంకేతాలు వచ్చినా… భూస్థాపితం అవడానికి ఎక్కువ రోజులు పట్టని వైసీపీకి..దాని అధినేత జగన్ కూ బాగా తెలుసు.
Read Also : జగన్ కూడా కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడా?
అంటే ఎన్డీఏ వాళ్లు సపోర్టు ఇవ్వరు.. ఇండియా కూటమిపార్టీలు వచ్చి మద్దతిస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానించలేరు. అంతేనా .. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏ అంశంలోనైనా జగన్ ఏ ఇతర పార్టీకైనా మద్దతు తెలిపారా అంటే.. లేనే లేదు. కానీ బీజేపీ ప్రాపకం కోసం ఇతర పార్టీల్ని విమర్శించిన ఘనత ఆయనది. ఏపీలో ఆయనేం చేశారో.. ఎందుకు అంత ఘోరంగా ఓడించారో దేశం మొత్తానికి తెలుసు. అందుకే ఆయన మాటల్ని వినేవారు ఎవరూ ఉండకపోవచ్చు. సపోర్టు చేసేందుకు కూడా ఎవరూ రాకపోవచ్చు.