నిర్మాత స్రవంతి రవికిషోర్ కు కాస్త ఇంట్రెస్ట్ వుంది. స్క్రిప్ట్ లను దగ్గర వుండి వర్క్ చేయించుకుంటారు. అలా అని హిట్ అవుతాయా, కాదా అన్నది వేరే సంగతి. ఒక్కోసారి స్కిప్ట్ వర్క్ స్టార్ట్ అయిన తరువాత లేదా, ప్రాజెక్టు మొదలయ్యాక కూడా ఆయన వదిలేస్తుంటారు. స్క్రిప్ట్ బాగా రాకపోయినా, కిట్టుబాటు కాదని తెలిసినా, అప్పటి దాకా అయిన ఖర్చు పోతో పొయిందని వదిలేస్తారు. ఆ మధ్య ప్రవీణ్ సత్తారు-రామ్ కాంబినేషన్ లో సినిమా అలాగే వదిలేసారు. అప్పటికి రెండు కోట్లు ఖర్చయింది కూడా.
ఇక పాయింట్ కు వస్తే, ఈవారం విడుదలుతున్న తేజ్..ఐ లవ్ యూ స్క్రిప్ట్ కూడా స్రవంతి ఆవరణలో తయారయిందే అని తెలుస్తోంది. డైరక్టర్ కరుణాకరన్ తో మళ్లీ ఓ ప్రాజెక్టు చేయాలని స్క్రిప్ట్ పని సార్ట్ చేసి, కానీ పూర్తిగా సంతృప్తి చెందక, స్రవంతి రవికషోర్ వదిలేసారట. అక్కడి ఓ యాభై లక్షల వరకు ఖర్చయిందని వినికిడి.
తరువాత ఆ స్క్రిప్ట్ కేఎస్ రామారావు దగ్గరకు చేరడం, ఆయన కొన్ని మార్పులు, చేర్పులు చెప్పడం, అది ఫైనల్ కావడం జరిగిందని తెలుస్తోంది. మరి ఇప్పుడు సినిమా బయటకు వచ్చాక కానీ తెలియదు. కేఎస్ రామారావు కరెక్టనొ, స్రవంతి రవికిషోర్ కరెక్ట్ నో. చేయించుకున్న మార్పులు వర్కవుట్ అయ్యాయో లేదో?