నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది. దేశంలో విశాఖ, విజయవాడ కంటే చిన్న నగరాలకు 5జీ సేవలు వచ్చాయి కానీ… ఏపీ వరకూ రాలేదు. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్లోని జామ్నగర్..లక్నో వంటి ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
కానీ ఏపీలో మాత్రం ఎలాంటి సిటీకి 5జీ సేవల జాబితాలో చోటు దక్కలేదు. ప్రభుత్వం వైపు నుంచి చొరవ లేకపోవడం… టెలికాం కంపెనీల నిర్లక్ష్యం… కలగలిపి ఏపీకి 5జీ సేవలు అందకపోవడానికి కారణం అయింది. 5జీ సేవలు అందుకుంటున్న నగరాల్లో కేవలం రాజధానులే కాదు.. అన్ని రకాల నగరాలు ఉన్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖ ప్రధాన నగరాలుగాఉన్నాయి. విశాఖ అత్యంత కీలకమైన నగరంగా ఉంది. అక్కడ జనాభా పరంగా.. స్మార్ట్ ఫోన్లు వాడే పరంగా ఎక్కువ చాయిస్ ఉంది. కానీ 5జీ సేవలు ప్రారంభించాల్సిన నగరాల జాబితాలో చోటు దక్కలేదు.
దేశంలో విశాఖ కంటే అన్ని విషయాల్లో వెనుకబడ్డ నగరాల్లోనూ 5జీ సేవలు వచ్చేస్తున్నాయి. విశాఖ తర్వాత విజయవాడ మహానగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నాస్కామ్ లెక్కల ప్రకారం మొబైల్ డేటా వినియోగంలో విజయవాడ నగరం దేశంలో 12వ స్థానంలో ఉంది. కనీసం ఇక్కడైనా 5జీ సేవలు అందించాలని సర్కారు చొరవ తీసుకొని ఉండాల్సింది. కానీ తీసుకోలేదు.. దాని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని.. లేకపోతే టెలికాం కంపెనీలు వచ్చి దరఖాస్తు పెట్టుకోలేదని ప్రభుత్వం అనుకుని ఉండవచ్చు.