మమతా బెనర్జీ చెప్పారంటే చంద్రబాబు కొనే ఉంటారని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో అదే పనిగా చెప్పారు. చివరికి బుగ్గన కూడా అదే అని విచారణ కోసం హౌస్ కమిటీని అడిగారు. స్పీకర్ సరే అన్నారు. రెండు రోజుల్లో పెగాసస్‌పై విచారణకు హౌస్ కమిటీని ప్రకటిస్తారు. అయితే అందరికీ వస్తున్న డౌట్ ఒకటే.. మమతా బెనర్జీ చెప్పారని అంటున్నారు కానీ ప్రభుత్వం వైసీపీ చేతుల్లో ఉంది.. కావాలంటే యాభై ఏళ్ల కిందటి నాటి రికార్డులు బయటకు తీసి క్షణాల్లో పెగాసస్ కొన్నారో లేదో చెప్పేయవచ్చు. ఎవరెవరిపై వాడారో చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా పూర్తిగా మమతా బెనర్జీ మీద తోసేసి.. విచారణకు హౌస్ కమిటీ వేయడం ఏమిటన్నది ఇప్పుడు అందరికీ ఓ పెద్ద డౌటానుమానంగా మారింది.
పెగాసస్ కొంటే చెప్పడానికి ప్రభుత్వానికి క్షణం పని !
ఏదో ఓ ప్రచారం చేయడానికి బాగుంటుందనుకుంటున్నారుకానీ.. సామాన్యులకు కూడా ప్రభుత్వం మీదే కదా ఎందుకు బయటపెట్టడం లేదన్న సందేహం వస్తుందన్న ఆలోచన చేయడం లేదు. అలాంటి ఆలోచన లేకుండా వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని వైసీపీ నేతలు అనుకుంటున్నారేమో కానీ తమ వ్యూహం తాము పాటిస్తున్నారు.అసెంబ్లీలో హౌస్ కమిటీ ప్రకటన చేసిన తర్వాత నిఘా మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టారు. పెగాసస్ స్పైవేర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. నిజంగా వాడి ఉంటే ప్రభుత్వమే ప్రకటన చేయాలని సూచించారు. – సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే పెగాసస్‌ను కొనలేదని డీజీపీ ఆఫీస్ లేదు అని చెప్పిందని అయినా ఆరోపణలు చేస్తున్నారని.. పెగాసస్‌పై అనుమానాలు నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు.
ఏదీ చెప్పకుండా రాజకీయ ఆరోపణలు ఎందుకన్న మాజీ నిఘా చీఫ్ !
2015 నుంచి 2019 మార్చి ఆఖరి వరకు ప్రభుత్వం గానీ, డీజీపీ ఆఫీస్‌గా, సీఐడీ విభాగం గానీ, ఏ ఇతర విభాగం గానీ, ఏ ప్రైవేటు ఆఫీస్ గానీ పెగాసస్ కొనలేదు వాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఒక స్టేట్మెంట్ ఇస్తే మంచిదని … లేనిపోని ఆరోపణలు అసత్యాలు అసంబద్దమైనటువంటి వాదనలతో ప్రజలను కన్ఫ్యూజన్లో పడేయడం ఎందుకని ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉందని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దామన్నారు.
ఏ విచారణ అయినా చేసుకోవాలని లోకేష్ సవాల్
పెగాసస్ అంశంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని టీడీపీ నేత నారా లోకేష్ సవాల్ చేశారు. అసలు చంద్రబాబు స్పైవేర్ కొన్నారని మమతా బెనర్జీ అన్నారో లేదో ఎవరికీ తెలియదన్నారు. అసెంబ్లీలో అన్నారని చెబుతున్న వీడియో బెంగాలీలోలో ఉందని.. బెంగాలీ భాష తెలిసిన వాళ్లు.. అసలు అందులో పెగాసస్ అంశంపైనే మాట్లాడలేదని చెబుతున్నారన్నారు. మొత్తంగా సారా మరణాల అంశాన్ని పెగాసస్‌తో తప్పుదోవ పట్టించడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని భావిస్తున్నారు.