సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయింది. అధికారంలో ఉన్నప్పుడు బూతుల స్క్రిప్టులన్నీ పార్టీ నేతలకు పంపుతారు. సాక్షిలో వచ్చే కథలు మాత్రం ఆయన మీడియా ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. అవే పెద్ద వాస్తవాలన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు ఆయన బయటకు రావడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ నేతలు ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాని సమయంలో.. ఆయనే ముందుకు వచ్చి గతంలోలా ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని కడిగిపారేయాలి. కానీ ఆయన ముందుకు రావడం లేదు.
ఎందుకో తెలియదు కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నారు. ప్రభుత్వాన్ని కడిగేయాలనుకుంటే.. తనను కడిగేస్తారేమోనని కంగారు పడుతున్నారు. అందుకే బయటకు రావడం లేదని చెబుతున్నారు. నిజానికి జగన్ తాడేపల్లిలో మూడు రోజులే ఉంటారు. ఆ రోజుల్లో ఆయన కనిపిస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. పార్టీ వ్యవహారాలను చాలా వరకూ పార్టీ ఆఫీసులో ఉన్న తన మనుషులతో నడిపిస్తున్నారు.
వైసీపీ నేతలు చేసిన ప్రతి అరాచకం వెనుక సజ్జల హస్తం ఉంది. చంద్రబాబు ఇంటిపై దాడి, పట్టాభి ఇంటిపై దాడి , టీడీపీ ఆఫీసుపై దాడి, బూతుల దాడి వెనుక ప్రతి స్కెచ్ సజ్జల రామకృష్ణారెడ్డిదే. దొరికిన వారంతా ఆయన పేరే చెబుతున్నారు. పోసాని నేరుగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ విచారణకు రాలేదు. అందుకే ఆయన అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పవర్ అనుభవించిన ఆయనే బయటకు రాకపోతే.. మిగిలిన వాళ్లు ఎలా వస్తారన్న విమర్శలు వచ్చే చాన్స్ ఉన్నా ఆయన తగ్గడం లేదు.