‘సైరా’లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బిగ్ బీ ఉండడం సైరాకి కలిసొచ్చే అంశం. బాలీవుడ్లో ఈ సినిమా వ్యాపారం జరగడానికి బిగ్ బీ కీలక పాత్ర పోషిస్తాడు కూడా. ‘సైరా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్‌కి అమితాబ్ బచ్చన్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సైరా ప్రెస్ మీట్ ముంబైలో అనగానే.. బిగ్ బీ వస్తారని అనుకున్నారు. ముంబైలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించేది అమితాబ్ బచ్చన్ కోసమే అనిపించింది. అయితే ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు.
చిత్రబృందం ఆలోచన మరోలా ఉంది. బిగ్ బీని ఇప్పుడే రంగంలోకి దింపకూడదని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆయన్ని ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లేదా విజయవాడలో ‘సైరా’ విడుదల ముందస్తు వేడుక నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ కార్యక్రమానికి బిగ్ బీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలని చిరు ప్లాన్. ముంబై ప్రెస్ మీట్‌కి బిగ్ బీని పిలిచేస్తే.. మళ్లీ ప్రి రిలీప్ ఈవెంట్‌కి ఆయన రారేమో అన్న అనుమానంతో.. ఆ ఆప్షన్ని ప్రీ రిలీజ్ వరకూ ఉంచుకున్నారన్నమాట.