పెట్టుబడుల సమ్మిట్‌ను వైసీపీ ప్లీనరీ తరహాలో ఘనంగా నిర్వహించి కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ట్యాగ్లు పంపించిన ప్రభుత్వ పెద్దలు.. బొత్స సత్యనారాయణను దూరం పెట్టారు. విశాఖ రాజధానిగా చెబుతూ.. ఉత్తరాంధ్ర కీలక నేత.. మంత్రిని ఈ సమ్మిట్‌లో కనిపించకుండా చేశారు.దీనికి కారణం ఏమిటన్నదానిపై వైసీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరు కాలేదు. వీరిద్దరికీ జగన్ ఓ టాస్క్ ఇచ్చారు. అదేమిటో బయటకు తెలియడం లేదు. ..కానీ ఉద్యోగ సంఘాలతో చర్చలని చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాల్సిన పని లేదు. అదీ కూడా సమ్మిట్ కు హాజరు కాకుండా మరీ చర్చలు జరిపేంత పీకల మీదకు ఇంకా ఉద్యోగులు ఉద్యమాన్ని తీసుకు రాలేదు. కేవలం వారిని దూరం పెట్టడానికి చర్చల పేరుతో సీన్ క్రియేట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే.. విశాఖలో పెట్టుబడుల సదస్సు కంటే..ఉద్యోగులతో చర్చల కంటే ఇంకా కీలకమైన విషయంపై ఓ టాస్క్ ను వారిద్దరికీ జగన్ ఇచ్చారని అంటున్నారు. అదేంటో వైసీపీలో కూడాఎవరికీ క్లారిటీలేదు.
కారణం ఏదయితేనేం కానీ.. అంత పెద్ద ఈవెంట్లో బొత్స మాత్రం కనిపించలేదు. సీనియార్టీలో ఆయన నెంబర్ టూ.. అఫీషియర్ గా నెంబర్ టు అయిన సజ్జల కూడా కనిపించలేదు. అందుకే…తెర ముందు సమ్మిట్ జరుగుతూంటే.. తెర వెనుక మరో ఘనకార్యానికి ఏదో స్కెచ్ వేశారని.. అందుకే వారు అమరావతిలో ఉన్నారని అంటున్నారు.