ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేయడానికి పూనుకోవడం తెలిసిందే. అయితే ఇదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లి రాజధాని భూముల రైతుల తరపున దీక్ష చేయబోతున్నారు. అయితే దీనిపై సూటిగా స్పందిస్తూ మండిపడ్డారు చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న రోజే జనసేన రాష్ట్రంలో మరొకచోట దీక్ష చేయడం బిజెపి పార్టీతో లాలూచీ పడి తెలుగుదేశం పోరాటాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే అంటూ వ్యాఖ్యానించాడు చంద్రబాబు. ఈ లాలూచీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. గతంలో మీడియా పవన్ కళ్యాణ్ నీ లక్ష్యంగా చేసుకుని తన తల్లిని దూషించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా సరిగ్గా చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష రోజునే పవన్ కళ్యాణ్ మీడియాను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఫిలిం ఛాంబర్ వద్ద హంగామా చేసి ప్రజల ఆసక్తిని అటువైపు డైవర్ట్ చేయడం తెలిసిందే. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద ఇవే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఇతర తెలుగుదేశం నాయకులు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం అవే వ్యాఖ్యలు స్వయంగా చంద్ర బాబు చేస్తున్నారు
అయితే జనసేన అభిమానులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. జనసేన ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా కొత్త పార్టీ అని అయోమయం పార్టీ అని వ్యాఖ్యలు చేసే చంద్రబాబు జనసేన చేసే దీక్ష గురించి మాత్రం ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా ఒకే రోజు రెండు దీక్షలు జరిగిన త మాత్రాన సీఎం స్థాయి వ్యక్తి అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని ఏ దీక్ష ప్రజలను కన్విన్స్ చేస్తుందో ఆ దీక్షకు ప్రజలు మద్దతిస్తారని, చంద్రబాబు దీక్ష పట్ల ప్రజల్లో నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా ప్రజలు ఆ దీక్షను గుర్తిస్తారని వారంటున్నారు.
అలాగే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా దీక్షలే చేసిందని అప్పుడు పవన్ కళ్యాణ్ ఏవిధంగాను అడ్డు పడలేదని జనసేన అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన తిరుపతిలో దీక్ష చేసినప్పుడు కానీ మే 22వ తేదీన విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు గారు స్వయంగా దీక్ష చేసినప్పుడు కానీ జూన్ నెలలో కాకినాడలో దీక్ష చేసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ పోటీ దీక్షలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఎవరూ పోటీగా దీక్షలు చేయనపుడే ఆ దీక్షలు జరిగాయి అని గుర్తు చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు అన్నాక ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి అవతల పార్టీ బలపడకుండా ప్రతి పార్టీ ప్రయత్నిస్తోంది. నిజంగా చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో నిబద్ధత ఉన్నపుడు- జనసేన కావచ్చు, మరింకే పార్టీ అయినా కావచ్చు వారు చేసే దీక్షలకు ముఖ్యమంత్రి స్థాయి తి ఉలిక్కిపడటం మాత్రం సబబుగా కనిపించడంలేదు. పైసా పోటీ దీక్షలు గురించి ప్రస్తావించి తన దీక్షకు మైలేజ్ రాదేమోనన్న అంతర్గత భయాన్ని తనే బయటపెట్టుకున్నాడు అన్న సందేహాలు కూడా ప్రజలకు వస్తాయి