సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకునే సరికి.. అత్యంత వివాదాస్పదమయిన అంశాల్లో ఒకటిగా మారిపోయింది… మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే కోడ్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కోడ్ అమలు కాదా..? తనకు మాత్రం ఎందుకు కోడ్‌ను అడ్డం పెడుతున్నారని.. ఆయన.. రోజూ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు.. ఇతర ముఖ్యమంత్రులతో పోల్చుకోవడం లేదు. కేవలం మోడీతో పోల్చుకుంటున్నారు. చంద్రబాబునాయుడు.. మోడీతోనే ఎందుకు పోల్చుకుంటున్నారు…?
రాజకీయాల్లో సీనియార్టీకి ప్రాధాన్యం లేదు..!
తుపాను ఫొని ప్రభావం కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడానికి.. ఒడిషా ప్రభుత్వానికి… వెంటనే.. కేంద్ర ఎన్నికల సంఘం.,.. రిలీఫ్ ఇచ్చింది. కోడ్‌ను సడలించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదు. చంద్రబాబు.. ఒడిషాకు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వలేదని.. కూడా చెబుతున్నారు. సమస్య ఏమిటంటే.. ఎన్నికల కమిషన్ వైఖరి అలాగే ఉంది. అలాగే… ఏపీ ప్రభుత్వ వైఖరి కూడా అలాగే ఉంది. ఎన్నికల కమిషన్ ఎందుకు ఏపీ విషయంలో… వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో… ప్రభుత్వం తరపున .. అడగాల్సిన అనుమతులు అడుగుతున్నారా లేదా… అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే.. ఎన్నికల సంఘం తీరు మాత్రం.. ఒకేలా లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నా… ఈసీ ఏమీ అనడం లేదు. అదే చంద్రబాబు ఉల్లంఘిస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే.. చంద్రబాబు పదే పదే మోడీతో పోల్చుకుని.. తాను సీనియర్‌నని చెప్పుకోవడం… సందర్భం లేని అంశం. అది చంద్రబాబు స్థాయిని కూడా తగ్గిస్తుంది. పదే పదే సీనియర్‌నని చెప్పడం.. కరెక్ట్ కాదు. బ్యూరోక్రసీలో సీనియార్టీ ఉంటుంది. కానీ.. రాజకీయాల్లో అలా ఉండదు. రాజకీయాల్లో చాలా జూనియర్లు.. పెద్ద పదవులలకు వెళ్లిపోతారు.
మోడీ కన్నా రాహుల్ ఇంకా జూనియర్ కదా..!
చంద్రబాబునాయుడు… మోడీ కన్నా .. తాను సీనియర్‌నని చెప్పుకుంటున్నారు. సీనియర్ని కాబట్టి.. తనకే ప్రాధాన్యం ఇవ్వాలన్నట్లుగా ఉంది వ్యవహారం. అయితే.. మోడీ కన్నా రాహుల్ గాంధీ ఇంకా జూనియర్ . ఇంకా చెప్పాలంటే… చంద్రబాబు కంటే.. రాహుల్ గాంధీ చాలా జూనియర్. అయినప్పటికీ.. కాంగ్రెస్ కూటమి తరపున.. బీజేపీయేతర పక్షాల తరపున రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి… చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నారు.. ? 1994లో.. రాహుల్ గాంధీ వయసు.. బహుశా పాతికేళ్లు ఉండవచ్చు. ఆ సమయంలోనే… చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు.. ఈ మాటను ఎప్పుడూ బయట ఎందుకు చెప్పడం లేదు..? నేను మోడీ కంటే ముందు ముఖ్యమంత్రి అయ్యా… అంటారు కానీ.. రాహుల్ గాంధీ నా ముందు బచ్చా.. అని ఎందుకు అనడం లేదు..?. అందుకే సీనియార్టీ విషయంలో… మోడీతో పోల్చుకోవడం… చంద్రబాబు స్థాయిని తగ్గిస్తుంది.
మోడీతో పదే పదే పోల్చుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది..!
ఎన్నికల కోడ్ విషయంలో… మోడీ విషయంలో.. ఈసీ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ప్రశ్నించాల్సిందే. మోడీకి వర్తించని కోడ్ తనకు ఎందుకు వర్తిస్తుందని… చంద్రబాబు పదే పదే ప్రశ్నించడం కన్నా.. అసలు… మోడీని ఎందుకు.. ఈసీ వదిలి పెడుతోదంన్న విషయాన్ని ప్రశ్నిస్తే… ప్రజల్లోకి వెళ్తుంది. అలా కాకుండా.. పదే పదే మోడీతో పోల్చుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తే… ప్రధాని అవుతారు కానీ… అనుభవం, హైటు, వెయిట్ లాంటివి చూడరు. ప్రజల మద్దతు పొందిన నాడే.. ప్రధాని అవుతారు. ప్రధాని విధానాలను ప్రశ్నించాలి. ఈసీ తీరును ప్రశ్నించారు. అంతే కానీ… మోడీతో పోల్చుకుని పదే పదే వ్యాఖ్యలు చేయడం వల్ల… ఎబ్బెట్టుగా ఉంటుంది.