వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి. దాని కోసం.. గురువారం.. ఒకటి, రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. ఎయిర్పోర్టుకు వస్తారు. విశాఖ జిల్లాలో ఆయన ఎంటరైనప్పటి నుంచి.. ఆయన ప్రతి వారం దినచర్య అదే. గురువారం… మధ్యాహ్నం ఫ్లైట్లో ఆయన హైదరాబాద్ వెళ్తారు. అలా జగన్ షెడ్యూల్… దాడి చేసిన జగన్ అభిమాని శ్రీనివాసరావుకు తెలిసింది. అతడు సినిమాలో చూశాడో.. ఆపరేషన్ ధుర్యోధనను ఔపాసన పట్టాడో కానీ.. మొత్తానికి… ఓ స్కెచ్ వేసుకున్నాడు. దాని ముందూ.. వెనుక.. ఎవరున్నారనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.
ఎయిర్పోర్టులో భద్రత ఎందుకు కల్పించలేక పోయారు..?
శ్రీనివాసులు ఎంచుకున్న స్థలం మాత్రం.. విమానాశ్రయం వీఐపీ లాంజ్. అక్కడ పూర్తిగా… సీఐఎస్ఎప్ అధీనంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఆ ఎయిర్పోర్టు నేవీది. భద్రత కూడా చూసుకుంటుంది. అలాంటి చోటకు… ఈ శ్రీనివాస్ కత్తితో పాటు వచ్చారు. దాడి ఘటన తర్వాత సీఐఎస్ఎఫ్ పోలీసులే పట్టుకున్నారు. విశాఖ పోలీసులకు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో..సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. ఏ వైఫల్యమైనా ఆ సంస్థదే కానీ. ఏపీ పోలీసులకు ఏ మాత్రం సంబంధం లేదు. మరి గతంలో.. విశాఖ ఎయిర్ పోర్టులోకి వచ్చి మరీ జగన్ ను ఆపారు కదా.. అని కొంత మంది వితండవాదం చేస్తున్నారు. కొంత మంది… శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు వస్తున్నారని.. తెలిస్తే.. సీఐఎస్ఎఫ్ ఆమోదంతోనే… పోలీసులు లోపలికి వచ్చి… అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటారు. అప్పుడు అదే జరిగింది. అంతే కానీ.. అక్కడకు జగన్ వస్తారని.. పోలీసులు లోపల టెంటేసుకుని కూర్చోరు.
కేంద్ర తప్పిదాన్ని ఏపీపై రుద్దే ప్రయత్నం ఎందుకు చేశారు..?
ఎయిర్పోర్టు కేంద్ర పరిధిలోనిది. అక్కడ ఏమైనా జరిగితే సిగ్గుపడాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ.. జీవీఎల్ నరసింహారావు అనే ఉత్తరప్రదేశ్ ఎంపీ మాత్రం.. ఏ మాత్రం సిగ్గు లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని.. ఉన్నత స్థాయి విచారణ చేయాలని.. అందులో కుట్ర కూడా ఉందని ప్రకటించేశారు. అసలు ఎయిర్ పోర్టులో భద్రత ఎందుకు కొరవడిందో విచారణ చేయాల్సింది ఎవరు..? ఈ విషయంలో సురేష్ ప్రభు.. వెంటనే స్పందించారు. ఈయనకు ఉన్నంత ఇంగిత జ్ఞానం సిగ్గూలజ్జ.. జీవీఎల్ నరసింహారావుకు లేవు. తమ తప్పిదాలను.. కూడా.. నోరు ఉంది కదా.. అని ఏపీ ప్రభుత్వంపై నెట్టేసేందుకు… ఉబలాటపడ్డారు.
ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలనుకున్నారా..?
అలా దాడి జరగడం.. మరుక్షణం… అదేదో ఏపీ ప్రభుత్వం వైఫల్యం అన్నట్లుగా ఓ వైపు.. అదేదో చంద్రబాబు చేయించారన్నట్లు మరో వైపు.. విస్తృతంగా ప్రచారం చేసి.. ఏపీలో ఓ రకమైన ఉద్రిక్త పరిస్థితులు తెచ్చే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా సాగింది. గతంలో.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. అలాంటివేదో తెచ్చి పెడితే.. ప్రజలు బలైపోయినా పర్వాలేదు.. తమకు రాజకీయంగా లబ్ది చేకూరుతుందన్న ఆలోచన మాత్రం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.